నవీన్, కుసుమ చందక జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ డేస్’. సురేష్ లంకలపల్లి దర్శకుడు. మాదల వెంకట కృష్ణప్రసాద్ నిర్మాత. శుక్రవారం చిత్ర టైటిల్ గ్లింప్స్‌ని సీనియర్ దర్శకుడు వి.సముద్ర విడుదల చేశారు. నేటి యువతకు కనెక్ట్ అయ్యే ట్రెండీ లవ్‌స్టోరీ ఇదని దర్శకుడు తెలిపారు.
వినూత్న కథ ఇదని, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వెంగీ, మాటలు: జి.రాంప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురేష్ లంకలపల్లి.