శ్రీకాళహస్తి స్థల పురాణం ఆధారంగా మంచు విష్ణు కథానాయకుడిగా తెరకెక్కిస్తున్న భక్తిరస ప్రధాన చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర నటుడు అక్షయ్ కుమార్ శివుడి పాత్రను పోషిస్తున్నారు. సోమవారం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను అక్షయ్‌కుమార్ తన సోషల్‌మీడియా ద్వారా విడుదల చేశారు.
ఇందులో త్రిశూలం చేతబూనిన మహాశివుడు ఆనందతాండవం చేస్తూ కనిపిస్తున్నారు. ఇలాంటి అద్భుతమైన చిత్రంలో భాగమైనందుకు ఆనందంగా ఉందని, శివుడి ఆశీస్సులతో సినిమాను ప్రేక్షకుల ముందుకుతీసుకొస్తున్నామని అక్షయ్ కుమార్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘కన్నప్ప’ చిత్రంలో మోహన్‌లాల్, మోహన్‌బాబు, ప్రభాస్, బ్రహ్మానందం, శరత్‌కుమార్, కాజల్ అగర్వాల్ వంటి అగ్ర తారలు భాగమవుతున్నారు. భారీ వ్యయంతో మోహన్‌బాబు మంచు రూపొందిస్తున్నారు.