Kriti Sanon : పిజా అంటే ఇష్టపడని వారుండరు. వెజిటబుల్స్, పనీర్, చికెన్ ఇలా ఏ వెరైటీలో అయినా ఈ ఇటాలియన్ డిలైట్‌ను ఎంతోమంది ఇష్టంగా ఆరగిస్తారు. ఫిల్మ్ స్టార్లు సైతం ఈ యమ్మీ డిష్‌ను చూసి తినకుండా ఉండలేరు.
బాలీవుడ్ నటి రియా కపూర్ ఇటీవల తాను సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఓ మూవీ సెట్లో జరిగిన పిజా పార్టీ విశేషాలను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. ఈ పార్టీలో సినీ బృందంతో పాటు డైరెక్టర్ కూడా ఉన్నారు. ఈ వీడియోలో ఇది నా ఎనిమిదో స్లైస్ అని కృతి సనన్ గట్టిగా అనడం ఈ క్లిప్‌లో వినిపిస్తుంది. తాను ఏడో స్లైస్‌ను ఎంజాయ్ చేస్తున్నానని కరీనా కపూర్ చెబుతుండటం చూడొచ్చు.
ఈ వీడియోను షేర్ చేస్తూ హీరోయిన్లు తినరని అంటారు..కరీనా కపూర్, కృతి సనన్‌తో పిజా పార్టీ..టబూ మిస్ యూ అని రియా కపూర్ రాసుకొచ్చారు. కృతి సైతం పిజా పార్టీ విశేషాలను తన ఇన్స్టాగ్రాం స్టోరీస్‌లో పోస్ట్ చేశారు.
Read More :
Family Star | విజయ్‌దేవరకొండ, మృణాళ్ ఠాకూర్ హోలీ డ్యాన్స్‌తో ఫ్యామిలీ స్టార్ సాంగ్ లాంఛ్