Lokesh Kanagaraj | కూలీ సినిమాతో ప్రేక్షకుల్లో సూపర్ క్రే్జ్ కొట్టేసింది కన్నడ భామ రచితా రామ్. ఈ చిత్రంలో రచితారామ్ నెగెటివ్ షేడ్స్ ఉన్నపాత్రలో ఇరగదీసి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. రచితారామ్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని నటి అయినా.. ఈ భామకు టాలీవుడ్లో గుర్తింపు తెచ్చింది మాత్రం కూలీ సినిమానే అని చెప్పక తప్పదు. లోకేశ్ కనగరాజ్ కూలీకి ముందు.. తర్వాత అన్నట్టుగా రచితా రామ్ పాత్రను డిజైన్ చేశాడనంలో ఎలాంటి అనుమానం లేదు. ఇప్పుడొక ఆసక్తికర వార్త ఇండస్ట్రీ సర్కిల్లో సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది.
డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సినిమాలో రచితా రామ్‌నే హీరోయిన్గా తీసుకుంటున్నారట. అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో లోకేశ్ కనగరాజ్ హీరోగా వినోదాన్ని అందించబోతుండగా..ఈ మూవీలో లోకేశ్ కనగరాజ్ రచితారామ్తో రొమాన్స్ చేయనున్నాడన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. ధనుష్‌తో కెప్టెన్ మిల్లర్, కీర్తిసురేశ్‌తో సాని కాయిధమ్ సినిమాలను డైరెక్ట్ చేశాడు అరుణ్ మథేశ్వరన్.
లోకేశ్ కనగరాజ్‌తో తీయబోయే తాజా ప్రాజెక్ట్ త్వరలోనే షురూ కానుందని సమాచారం. తన డెబ్యూ సినిమా పూర్తయిన వెంటనే లోకేశ్ కనగరాజ్ కమల్ హాసన్, రజినీకాంత్ మల్టీ స్టారర్‌పై ఫోకస్ పెట్టనున్నట్టు కోలీవుడ్ సర్కిల్ సమాచారం. డైరెక్టర్‌గా సూపర్ ఫాంలో ఉన్న లోకేశ్ కనగరాజ్ మరి హీరోగా ఎలాంటి బ్రేక్ అందుకుంటాడనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
Anjali Raghav | అనుచితంగా హీరోయిన్ నడుము తాకిన స్టార్ నటుడు.. వివాదంపై స్పందించిన నటి
Vishal – Dhansika | ఇద్దరు ఒక్క సినిమా కూడా చేయలేదు.. విశాల్, ధన్సిక మధ్య ప్రేమ ఎలా పుట్టింది?