Lokesh Kanagaraj | ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘కూలీ’ వంటి విజయవంతమైన చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ఇప్పుడు నటుడిగా మారబోతున్నారు. గత కొంతకాలంగా వినిపిస్తున్న వార్తలను నిజం చేస్తూ ఆయన కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రం ‘డీసీ’ (DC)ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాకు అరుణ్ మాథేశ్వరన్ (Arun Matheshwaran) దర్శకత్వం వహిస్తుండగా.. సన్ పిక్చర్స్ (Sun Pictures) నిర్మిస్తుంది. లోకేశ్ కనగరాజ్ సరసన వామికా గబ్బీ కథానాయికగా నటిస్తుంది. అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ వీడియోలో లోకేశ్ కనగరాజ్ మునుపెన్నడూ చూడని మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. శరీరం నిండా రక్తం మరకలతో, సరికొత్త అవతారంలో ఉన్న ఆయన లుక్ సినీ అభిమానుల దృష్టిని విశేషంగా ఆకర్శిస్తుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.