Lokah Chapter 1: Chandra | మలయాళం నుంచి వచ్చిన ‘లోకా: చాప్టర్ 1 – చంద్ర’ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. నటుడు దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ చిత్రం కేవలం రూ. 30 కోట్ల బడ్జెట్‌తో రూపొంది విడుదలైన వారం రోజుల్లోనే రూ.101 కోట్ల వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం మరో అరుదైన రికార్డును అందుకుంది. ఈ చిత్రం విడుదలైన కేవలం 13 రోజుల్లోనే రూ. 202 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకుంది. మరోవైపు ఈ సినిమాతో రూ. 200 కోట్ల క్లబ్లో చేరిన తొలి హీరోయిన్ లీడ్ మూవీగా రికార్డు సృష్టించింది.
దర్శకుడు డామినిక్ అరుణ్, మలయాళ జానపద కథకు సూపర్ ఉమెన్ కథాంశాన్ని జోడించి ఈ సినిమాను రూపొందించారు. కళ్యాణి ప్రియదర్శన్ సూపర్ ఉమెన్‌గా ప్రధాన పాత్రలో నటించగా, నస్లెన్ కె. గఫూర్ కథానాయకుడిగా నటించారు. ఈ సినిమా కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కూడా మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ సినిమాకు అద్భుతమైన విజయం రావడంతో ‘లోకా’ యూనివర్స్‌లో మొత్తం ఐదు భాగాలు ఉంటాయని దర్శకుడు ప్రకటించారు.
Your love makes us happy, grateful and humble. Thank you! ☺️#Lokah #TheyLiveAmongUs@DQsWayfarerFilm @dulQuer @dominicarun@NimishRavi@kalyanipriyan@naslen__ @jakes_bejoy @chamanchakko @iamSandy_Off @santhybee @AKunjamma pic.twitter.com/N6gTC3p5UD
— Wayfarer Films (@DQsWayfarerFilm) September 10, 2025