Asaduddin Owaisi | అసలు అది ఒక సినిమానా?: ‘ధురంధర్ 2’పై అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు
Asaduddin Owaisi | హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ 'ధురంధర్ 2' సినిమాపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
Asaduddin Owaisi | హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ‘ధురంధర్ 2’ సినిమాపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నప్పటికీ, ఒవైసీ మాత్రం దీనిని ఒక చెత్త సినిమాగా అభివర్ణించారు.
ఒక మీడియా సదస్సులో ఒవైసీ మాట్లాడుతూ.. ‘ధురంధర్ 2’ వంటి మూడు గంటల పనికిరాని సినిమాలను చూసే సమయం తనకు లేదని అన్నారు. ఈ చిత్రం పూర్తిగా హింసను ప్రేరేపించేలా ఉందంటూ ఆయన మండిపడ్డారు. “అసలు అది ఒక సినిమానా? అందులో మూడు గంటల పాటు కేవలం బూతులు, హింస తప్ప మరేమీ లేదు” అని ఆయన కొట్టిపారేశారు. ఈ సినిమాలో ముస్లింలను చిత్రీకరించిన విధానంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారని గుర్తు చేయగా.. ఆయన తనదైన శైలిలో హైదరాబాదీ యాసలో స్పందిస్తూ, ఇలాంటి విషయాలను తాను పట్టించుకోనని (ఐసే చీజాం కు హమ్ లైట్ లేతే) తేల్చి చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

