బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తున్న బిగ్ బాస్(Bigg Boss) కార్యక్రమం సగం రోజులు పూర్తి చేసుకుంది. 19మందితో షో ప్రారంభం కాగా, ఏడుగురు ఎలిమినేట్ అయ్యారు. ఇందులో ఆరుగురు మహిళా కంటెస్టెంటే. ఇక ఎనిమిదో వారం నామినేషన్ ప్రక్రియ చాలా ఎమోషనల్‌గా సాగగా, రవి, లోబో, షణ్ముఖ్, సిరి, శ్రీరామ్, మానస్ ఈ వారం నామినేషన్లలో ఉన్నారు. ఇక వీకెండ్ రావడంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
బిగ్ బాస్ సీజన్ 5కి సంబంధించి మొదటి నుండి లీకులు వస్తూనే ఉన్నాయి. ఎలిమినేట్ అయ్యే వారు, నామినేషన్లో ఉండే వారు, వరస్ట్ పర్ఫార్మర్, కెప్టెన్ ఎవరు కానున్నారు అనేవి ముందే తెలిసిపోతున్నాయి. తాజాగా ఈ రోజు బిగ్ బాస్ నుండి లోబో ఎలిమినేట్ కాబోతున్నట్టు జోరుగా ప్రచారం నడుస్తుంది.ఆయన ఇప్పటికే ఎలిమినేట్ అయి బయటకు కూడా వచ్చేసినట్టు తెలుస్తుంది.
లోబో(Lobo) దాదాపు వారం రోజులు సీక్రెట్ రూమ్‌లో గడిపిన తర్వాత రీసెంట్గా హౌస్‌లో గ్రాండ్ గా రీఎంట్రీ అయ్యాడు. కానీ మరింత డౌన్ అయినట్టుగా కన్పిస్తోంది. దీంతో ప్రేక్షకులు కూడా ఆయనని ఎలిమినేట్ చేయాలని భావించారు. లోబో తప్ప నామినేషన్లో ఉన్న వారు అందరు స్ట్రాంగ్‌గానే కనిపిస్తున్నారు.