బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం హౌజ్‌ఫుల్ 3 ఫేం లిసా హేడాన్ మూడో బిడ్డకు జన్మనిచ్చింది. లిసా ఆమె భర్త డినో లాల్వాని దంపతులకు మూడో సంతానంగా ఆడపిల్ల పుట్టగా, ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించలేదు. అయితే ఓ నెటిజన్ కామెంట్‌కు ఈమె తనకు మరో బిడ్డ పుట్టినట్టు సమాధానం ఇచ్చింది.ఇప్పటికే వారికి జాక్, లియో అనే ఇద్దరు కుమారులు ఉన్నసంగతి తెలిసిందే.
ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ నెటిజన్ .. మీ మూడో బేబి ఎక్కడనున్నారు అని అడగగా, అందుకు సమాధానం ఇచ్చిన లిసా నా చేతులలో అని చెప్పుకొచ్చింది. కాగా, లిసా హేడాన్ ఈ సంవత్సరం ప్రారంభంలో తన గర్భం ప్రకటించింది. తన బేబి బంప్‌పై చేతులు పెట్టి త్వరలో ఆడపిల్ల పుట్టనుందని చెప్పుకొచ్చింది. కొన్ని వారాల క్రితం తన శ్రీమంతం వేడుకకు సంబంధించిన ఫొటోలు కూడా షేర్ చేసింది. వైట్ థీమ్‌తో ఈ వేడుక జరిపించగా, ఇందుకు సంబంధించిన ఫొటోలు నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకున్నాయి.