దర్శకుడు లింగుస్వామి అనగానే ‘పందెంకోడి’ సినిమా గుర్తొస్తుంది. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘ఆవారా’ కూడా బాగానే ఆడింది. ఆ మాధ్య హీరో రామ్ పొతినేనితో ‘వారియర్’ అనే సినిమా కూడా చేశారాయన. ప్రస్తుతం ఆయన నుంచి ఓ ఆసక్తికరమైన అప్డేట్ వినిపిస్తున్నది. ‘మహాభారతం’లోని ఓ మహావీరుడి చరిత్రను ఆయన తెరకెక్కించనున్నారట.
700వందల కోట్ల భారీ బడ్జెట్లో పానిండియా స్థాయిలో ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఇందులో టాలీవుడ్‌కి చెందిన హీరో నటిస్తారని టాక్. మరి ఈ సినిమాను నిర్మించేదెవరో, ఆ హీరో ఎవరో? ‘మహాభారతం’లోని ఆ మహావీరుడు ఎవరో? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.