Liger Movie | లైగర్‌కు ఓటీటీ భారీ ఆఫర్.. రిజెక్ట్ చేసిన మేకర్స్..!
Liger Makers Rejected Huge Ott Offer | దక్షిణాదితో పాటు ఉత్తరాది ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం ‘లైగర్’. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు, ట్రైలర్‌కు విశేష స్పందన వచ్చింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ఆగస్టు 25న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస ప్రమోషన్లతో బిజీగా గడుపుతున్నారు. ముఖ్యంగా చిత్రబృందం ఇండియా టూర్ పేరుతో ప్రతి రాష్ట్రంలో ప్రమోషన్లను జరుపుతూ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టంట వైరల్‌గా మారింది.
మేకర్స్ విడుదల చేసిన పాటలు, ట్రైలర్ సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే లైగర్‌కు భారీ స్థాయిలో థియేట్రికల్ బిజినెస్ జరుగుతుంది. అయితే ఈ సినిమాకు పాండమిక్ టైంలో ఓ భారీ ఆఫర్ వచ్చిందట. లైగర్ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ దాదాపు రూ.200కోట్లు ఆఫర్ చేసిందట. కానీ మేకర్స్ ఈ ఆఫర్‌ను తిరస్కరించారట. థియేటర్లోనే లైగర్ చిత్రాన్ని విడుదల చేస్తామని చెప్పారట. సినిమాపై ఉన్న నమ్మకంతోనే అంత పెద్ద ఆఫర్‌ను మేకర్స్ రిజెక్ట్ చేశారట.
ఈ చిత్రంలో విజయ్‌కు జోడీగా అనన్యపాండే హీరోయిన్గా నటిస్తుంది. కరణ్‌జోహర్, ఛార్మీతో కలిసి పూరి స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ కీలకపాత్రలో నటించాడు. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

