సర్వేయర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి
రాష్ట్రంలోని రెవెన్యూ సర్వేయర్ల సమస్యలు పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ రెవెన్యూ లైసెన్స్డ్ సర్వేయర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగర రమేశ్, ప్రధాన కార్యదర్శి కొమ్ము శేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
- లైసెన్స్డ్ సర్వేయర్స్ అసోసియేషన్ డిమాండ్
- సర్వే భవన్ వద్ద నిరసన
హిమాయత్‌నగర్, ఆగస్టు18: రాష్ట్రంలోని రెవెన్యూ సర్వేయర్ల సమస్యలు పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ రెవెన్యూ లైసెన్స్డ్ సర్వేయర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగర రమేశ్, ప్రధాన కార్యదర్శి కొమ్ము శేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లైసెన్స్డ్ సర్వేయర్ల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నారాయణగూడలోని సర్వేభవన్ ఎదుట నిరసన చేపట్టారు.
ఆందోళన చేస్తున్న సర్వేయర్లను నారాయణగూడ పోలీసులు అరెస్టు చేసి పలు పోలీస్స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా రమేశ్, శేఖర్ మాట్లాడుతూ.. ‘రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6,500 మంది లైసెన్స్డ్ సర్వేయర్లు పనిచేస్తున్నారని, సర్వేయర్లకు గౌరవ వేతనం రూ.30 వేలతోపాటు ప్రతి సర్వేయర్‌కు రూ.కోటి జీవి త బీమా కల్పించాలి.
ప్రతి రెండు గ్రామపంచాయతీలకు ఒక సర్వేయర్‌ను నియమించా లి’ అని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నేతలు దేవునూరి రా జు, బాలకృష్ణ,దుబ్బ గోవర్ధన్, సందీప్, విదేశ్నాయక్, సంధ్య, బండి శ్రీనివాస్, నాగేశ్వ ర్, సోను, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

