Lokesh Kanagaraj | కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) గాయపడ్డారు. ఆయన తెరకెక్కించిన లియో చిత్ర ప్రమోషన్స్ (Films Promotions)లో తొక్కిసలాట చోటు చేసుకోవడంతో చిన్నపాటి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని లోకేశ్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ (Vijay) హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన తాజా చిత్రం లియో (Leo). ఈనెల 19న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద దూసుకెళ్తోంది. కలెక్షన్ల పరంగా కాసుల వర్షం కురిపిస్తోంది. ఇక దర్శకుడు లోకేశ్ చిత్ర ప్రమోషన్స్‌లో బిజీబిజీగా గడుపుతున్నారు. పలు ప్రాంతాల్లో అభిమానులతో కలిసి థియేటర్లో లియో చిత్రాన్ని వీక్షిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే కేరళ (Kerala) రాష్ట్రం పాలక్కాడ్ (Palakkad)లోని ఓ థియేటర్‌కు వెళ్లారు.
ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ లోకేశ్‌ను చూసేందుకు అక్కడికి తరలివచ్చారు. దర్శకుడితో సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఈ క్రమంలో అక్కడ కాస్త తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో లోకేశ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ విషయాన్ని లోకేశ్ కనగరాజ్ ట్విట్టర్ (ఎక్స్) ద్వారా వెల్లడించారు. తనపై ఇంత ప్రేమను చూపించిన కేరళ అభిమానులకు ప్రత్యేక థ్యాంక్స్ చెప్పారు. పాలక్కాడ్‌లో ఫ్యాన్స్‌ను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అయితే, జనసమూహం కారణంగా చిన్న గాయమైనట్లు వెల్లడించారు. దీంతో త్రిసూర్, కొచ్చిలో జరగాల్సిన ప్రమోషన్స్ ఈవెంట్స్‌కు హాజరుకాలేకపోతున్నట్లు వెల్లడించారు. త్వరలో కేరళకు వచ్చి అందరినీ కలుస్తానని చెప్పారు. అప్పటి వరకూ ‘లియో’ చిత్రాన్ని ఆస్వాదించండి అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ఇది చూసిన అభిమానులు లోకేశ్ త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Thank you Kerala for your love.. Overwhelmed, happy and grateful to see you all in Palakkad. ❤️
Due to a small injury in the crowd, I couldn’t make it to the other two venues and the press meeting. I would certainly come back to meet you all in Kerala again soon. Till then… pic.twitter.com/JGrrJ6D1r3
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) October 24, 2023
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘లియో’ చిత్రంలో దళపతి విజయ్ టైటిల్ రోల్ పోషించారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోపై నిర్మించిన ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించింది. ప్రియా ఆనంద్, మలయాళ నటి శాంతి మాయాదేవి, మన్సూర్ అలీఖాన్, గౌతమ్ వాసు దేవ్‌మీనన్, మిస్కిన్, మాథ్యూ థామస్, సాండీ కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 19న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజైంది.
Also Read..
శ్రీదేవిలా శ్రీలీల.. దిల్ రాజు ఫిదా
Narakasura Trailer | క్యూరియాసిటీ పెంచుతోన్న రక్షిత్ అట్లూరి నరకాసుర ట్రైలర్
Saripodhaa Sanivaaram | నాని సినిమా కోసం ఎస్జే సూర్య రెమ్యునరేషన్ అన్ని కోట్లా..?