అవార్డుల కంటే ‘నటన బావుంది’ అనే ప్రశంసలే తనకు ఎక్కువ సంతోషాన్నిస్తాయని అంటున్నారు లెజెండరీ యాక్టర్ పరేష్ రావెల్. ఇటీవల ప్రతిష్టాత్మ పురస్కారాలపై తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వ్యక్తపరిచారాయన. ‘అవార్డులు ప్రతిభకు కొలమానం కానేకాదు. లాబీయింగ్ చేసి సంపాదించిన అవార్డులు ఇంట్లో మనల్ని వెక్కిరిస్తుంటాయి.
జాతీయ పురస్కారాల్లోనూ లాబీయింగులు ప్రస్తుతం ఎక్కువైపోయాయి. తాజాగా ఆస్కార్ అవార్డుల్లోనూ దీనికి ఆస్కారముందని తెలిసింది. చిత్రబృందం తమ నెట్వర్క్ను ఉపయోగించి, కొన్ని పార్టీలను నిర్వహించి జ్యూరీ సభ్యులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తారు. నన్నడిగితే ఇలాంటి అవార్డులు రాకపోతేనే మేలు. నటీనటులకు ఈ అవార్డుల ట్రోఫీల కంటే దర్శక, నిర్మాతల ప్రశంసలే విలువైనవి.’ అని పేర్కొన్నారు పరేష్ రావెల్.