అందాలరాక్షసి, సోగ్గాడే చిన్ననాయన, భలేభలే మగాడివోయ్ సినిమాలతో డీసెంట్ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు మెగా కోడలు లావణ్య త్రిపాఠి. కథానాయికగా గౌరవప్రదమైన పాత్రలు పోషించి, అంతే గౌరవంగా వరుణ్‌తేజ్‌ని వివాహమాడేసి ప్రస్తుతం ఇల్లాలిగా బాధ్యతలు నిర్వర్తించే పనిలో ఉన్నారామె.
సినిమాలు చేసుకునే స్వేచ్ఛను కూడా మెగా ఫ్యామిలీ ఆమెకు కల్పించింది. మరి కథానాయికగా లావణ్య నుంచి ఇప్పటివరకూ ఎలాంటి అప్డేట్ రాలేదు. ప్రస్తుతమైతే అత్తగారికి వంటలో సాయం చేస్తూ, వరుణ్‌తో సినిమా ముచ్చట్లతో టైంపాస్ చేస్తూ, మధ్యమధ్య ఇన్‌స్టాలో కొత్తకొత్త ఫొటోలను షేర్ చేస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు లావణ్య కొణిదెల త్రిపాఠి.
రీసెంట్గా తన ఇన్‌స్టాలో లావణ్య ఓ ఫొటో షేర్ చేశారు. ఆ ఫొటోలో వైట్ ఫ్యాంట్, టీషర్ట్ ధరించి, వాల్ సపోర్ట్‌తో ైస్టెలిష్‌గా నిలబడ్డ లావణ్య స్టిల్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో బాగా వైరల్ అవుతున్నది. ఈ ఫొటోతో పాటు ‘తెలివైన శీర్షికలన్నీ అయిపోతున్నాయి’ అని ఓ ఆసక్తికరమైన క్యాప్షన్ కూడా జత చేసింది. దీని భావం తెలీక ఆమె ఫాలోవర్స్ తలలు బాదుకుంటున్నారు.
ఏదేమైనా లావణ్య స్టిల్ మాత్రం చూపరులను బాగా ఆకర్షిస్తున్నది. ప్రస్తుతం ఆమె నటించిన ఓ తమిళ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. పెళ్లయ్యాక కొత్త సినిమాలేవీ లావణ్య ఒప్పుకున్నట్టు లేదు.