అందాల రాక్షసి సినిమాతో తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi). ఆ తర్వాత తెలుగులో మనం, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనాతోపాటు పలు తెలుగు, తమిళ చిత్రాల్లో మెరిసింది. ఈ ఏడాది లీడ్ రోల్లో హ్యాపీ బర్త్ డే సినిమాలో మెరువగా.. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. అయితే ఈ భామకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.
హ్యాపీ బర్త్ డే (Happy Birthday) ఫెయిల్ అయినా ఈ భామకు ఆఫర్లు మాత్రం వరుసగా క్యూ కడుతున్నాయట. తాజా టాక్ ప్రకారం లావణ్య త్రిపాఠి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. కోన వెంకట్ తెరకెక్కిస్తున్న జీ5 ఒరిజినల్ సిరీస్ పులిమేకలో లీడ్ రోల్ పోషిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఓ తమిళ సినిమాలో అథర్వకు జోడీగా కూడా నటిస్తోంది. కొన్ని పాటలు మినహా ఈ మూవీ షూటింగ్ పూర్తయింది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో మంజునాథ డైరెక్ట్ చేస్తున్న తెలుగు సినిమా కూడా చేస్తోంది లావణ్య త్రిపాఠి. సైకలాజికల్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ మూవీ వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి కెరీర్లో సక్సెస్, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాల ఆఫర్లతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతోంది లావణ్య త్రిపాఠి.
Read Also :Driver Jamuna | డ్రైవర్ జమున విడుదల వాయిదా.. ఇంతకీ కారణమేంటో?