బుధవారం 03 జూన్ 2020
Cinema - May 02, 2020 , 23:55:41

సలహాలు తీసుకుంటా!

సలహాలు తీసుకుంటా!

‘అందాల రాక్షసి’ ‘భలే భలే మగాడివోయ్‌' ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రాలతో యువతరంలో మంచి ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది సొట్టబుగ్గల సొగసరి లావణ్య త్రిపాఠి. ఇటీవల సోషల్‌మీడియాలో అభిమానులతో ముచ్చటించిన ఈ సుందరి తెలుగులో కెరీర్‌ సాఫీగా సాగిపోతోందని ఆనందం వ్యక్తం చేసింది. అయితే కెరీర్‌ తొలినాళ్లలో కొన్ని సినిమాల  విషయంలో  అయోమయానికి గురయ్యానని చెప్పింది. ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాను అంగీకరించడానికి చాలా ఆలోచించానని పేర్కొంది. ‘కెరీర్‌ ఆరంభంలోనే సీనియర్‌ హీరోల సరసన నటిస్తే అవకాశాలు దెబ్బతింటాయని చాలా మంది వారించారు.  నాగార్జున వంటి స్టార్‌హీరో సినిమా కావడంతో ఒప్పుకున్నాను.  షూటింగ్‌ సమయంలో నాగార్జునగారు కెరీర్‌ను తీర్చిదిద్దుకునే విషయంలో అమూల్యమైన సలహాలిచ్చారు. ఇప్పటికీ ముఖ్యమైన అంశాల్లో ఆయన సలహాలు తీసుకుంటా. ఆయన నాకు గైడ్‌ లాంటివారు’ అని చెప్పింది. 


logo