Lavanya konidela tripathi | మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత కొన్ని రోజులు సినిమాలకు బ్రేక్‌నిచ్చిన విషయం తెలిసిందే. 2023లో వరుణ్ తేజ్‌తో కలిసి వివాహ బంధంలో అడుగుపెట్టిన లావణ్య సుమారు ఏడాదిపాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. అయితే పెళ్లి తర్వాత మెగా కోడలిగా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలిపింది. లావణ్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం సతీ లీలావతి(). భీమిలీ కబడ్డీ జట్టు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న తాతినేని సత్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ పతాకాలపై నాగమోహన్ బాబు.ఎమ్, రాజేష్.టి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు మేకర్స్. ఈ ఫస్ట్ లుక్‌లో లావణ్య కోపంతో అరుస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే మూవీ భార్య భర్తలమధ్య ఉన్న అనుబంధం ఆధారంగా ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది.
మలయాళ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీకి మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తుండగా, సినిమాటోగ్రాఫర్‌గా బినేంద్ర మీనన్, ఎడిటింగ్ బాధ్యతలను సతీష్ సూర్య చేపడుతున్నారు. మరోవైపు లావణ్య- వరుణ్ దంపతులు త్వరలోనే తల్లిదండ్రులం కాబోతున్నట్లు ఇటీవల ప్రకటించారు.
This film holds a special place in my heart for so many reasons. Had an amazing time working with this incredibly talented team ✨#SathiLeelavathi
First Look & Motion Poster of #SathiLeelavathi out now! 👉 https://t.co/EXShra9ZHh @ActorDevMohan
@SatyaTatineni
@ddp_offl… pic.twitter.com/cK3aRGvEFr— Lavanya konidela tripathi (@Itslavanya) June 21, 2025
Read More