ముంబై: ‘లపతగంజ్’ వెబ్ సిరీస్‌లో చౌరాసియా పాత్ర ద్వారా ఫేమస్ అయిన నటుడు అరవింద్ కుమార్ ఇక లేరు. ఇవాళ మధ్యాహ్నం ఆయన గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. లపతగంజ్ బృందంతో కలిసి షూటింగ్‌కు వెళ్తుండగా ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. దాంతో తోటి నటులు ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
అక్కడ వైద్యులు చికిత్స అందిస్తుండానే అరవింద్ కుమార్ మృతిచెందారు. ఈ విషయాన్ని లపతగంజ్లోని ప్రధాన పాత్రదారు అయిన రోహితాశ్వ్ గౌర్ మీడియాకు వెల్లడించారు. అరవింద్‌కు ఆర్థికపరమైన ఒత్తిళ్లు ఉన్నాయని, అవే ఆయనకు గుండెపోటు రావడానికి కారణమై ఉండవచ్చని రోహితాశ్వ్ అభిప్రాయం వ్యక్తంచేశారు.