మన స్టార్ హీరోలు కార్లు మీద ఎక్కువ మోజు చూపిస్తూ ఉంటారనే సంగతి మనందరికి తెలిసిందే. ఎన్టీఆర్ విషయానికి వస్తే ఆయన లగ్జరీ కార్లపైనే ఎక్కువ మక్కువ చూపిస్తుంటారు. ఆయన గ్యారేజ్‌లో ఇప్పటికే 20కి పైగా కార్లు ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే కొన్న కార్లకు ఎక్కువగా 9999 వచ్చేలా ఫాన్సీ నెంబర్లు మీద కూడా ఆయన ఆసక్తి చూపిస్తూ ఉంటారు. రీసెంట్గా ఎన్టీఆర్.. అత్యంత్య విలాసవంతమైన, అద్భుతమైన ఫీచర్లు ఉన్న లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ క్యాప్సూల్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు భారతదేశంలో మొట్టమొదటి లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ యొక్క యజమాని ఎన్టీఆర్ కాగా, ఇది అరోన్సియో అర్గోస్‌తో కాంట్రాస్ట్ కలర్‌తో నీరో నోక్టిస్ మాట్టేతో కూడా వస్తుంది. ఈ మోడల్ కారు ఆన్ రోడ్ ధర Rs.3.15 – 3.43 కోట్ల రూపాయలుగా ఉంది. కారును ఎన్టీఆర్ కొన్ని నెలల కిందట బుక్ చేశారు. అయితే ఆ కారుకు ఉన్న డిమాండ్ కారణంగా డెలివరీ లేట్ అయింది.
రీసెంట్గా ఎన్టీఆర్ ఇంటికి వచ్చిన ఆ కారుని చూసి చాలా మంది స్టన్ అవుతున్నారట. అందులో ఉండే ఫీచర్స్ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి అంటున్నారు. తాజాగా హీరో శ్రీకాంత్, ఎన్టీఆర్.. లగ్జరీ కారు ముందు ఫొటో దిగగా ఈ పిక్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ఇప్పటికే ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి చేసిన జూనియర్ త్వరలో కొరటాలతో కలిసి సినిమా చేయనున్నాడు.