విమాన చార్జీలకు రెక్కలు.. ఇంధన ధరలు భగ్గుమనడం వల్లనే
దేశీయ విమానయాన టికెట్ ధరలు భగ్గుమన్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా విమాన ఇంధన ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోయాయి.
- 44 శాతం వరకు పెరిగిన దేశీయ విమాన టిక్కెట్టు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: దేశీయ విమానయాన టికెట్ ధరలు భగ్గుమన్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా విమాన ఇంధన ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోయాయి. ఫలితంగా విమానయాన సంస్థలపై పడుతున్న ఈ ఇంధన భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా విమాన టికెట్ ధరలను భారీగా పెంచేశాయి. దేశీయంగా సరాసరి విమాన టికెట్ ధర 40 శాతానికి పైగా పెంచినట్టు సమాచారం. అంతర్జాతీయ రూట్లో అయితే ఏడాది క్రితం రూ.52 వేలుగా ఉన్న టికెట్ ధర ప్రస్తుతం రూ.75 వేలకు పైగా చేరుకున్నది. అంటే ఇంచుమించు 40 శాతానికి పైగా సవరించాయి. అలాగే గతేడాది రూ.5,850గా ఉన్న సరాసరి దేశీయ విమాన టికెట్ ధర ప్రస్తుతం రూ.8,450కి చేరుకున్నది. సరాసరి దేశీ బుకింగ్ విలువ ఏడాది క్రితం రూ.8,500 నుంచి రూ.9,500 వరకు ఉండగా, ప్రస్తుతం ఇది రూ.9 వేల నుంచి రూ.10 వేలకు చేరుకున్నాయి.
ఎయిర్‌లైన్స్‌లకు అండగా..
నష్టాలతో నడుస్తున్న విమానయాన సంస్థలకు అండగా కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నది. ఇంధన ధరాభారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంస్థలకు ఈ ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించడానికి కేంద్రం పలు కీలక నిర్ణయాలు ప్రకటించింది. ధరలపై ఉన్న నియంత్రణను స్వల్పంగా ఎత్తివేసింది. 60 శాతం ఉచిత సీట్ల కేటాయింపును రద్దు చేసింది. అలాగే ఏటీఎం సర్‌చార్జీని విధించుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. మొత్తం నిర్వహణలో 60 శాతం ఇంధనం కోసం వెచ్చిస్తున్న సంస్థలకు రూపాయి పతనంDomesticకూడా ఈ నష్టాలను మరింత పెంచింది.Domestic
కొన్ని రూట్లలో చార్జీల వివరాలు
- ఢిల్లీ-బెంగళూరుల మధ్య టికెట్ ధర రూ.10,500 నుంచి రూ.14 వేల మధ్యలో. 15 రోజుల ముందు అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే రూ.7,200-8,500 మధ్యలో.
- ముంబై-చెన్నై మధ్యలో అత్యవసరంగా బుకింగ్ చేసుకుంటే రూ.8,200 నుంచి రూ.10,500 మధ్యలో. అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే రూ.4,400 నుంచి రూ.5,200 మధ్యలో
- ముంబై-ఢిల్లీ రూట్లో రూ.9,500 నుంచి రూ.12,800 మధ్యలో ఉన్నది. అడ్వాన్స్‌గా బుకింగ్ చేసుకున్నవారికి రూ.5,800 నుంచి రూ.7,100 మధ్యలో
- బెంగళూరు-ముంబై మధ్యలో ప్రస్తుతం రూ.8,400 నుంచి రూ.11,200 మధ్యలో ఉన్నది. పక్షం రోజుల ముందు బుకింగ్ చేసుకుంటే రూ.4,900 నుంచి రూ.6,300 మధ్యలో
- ఢిల్లీ-వారణాసిల మధ్య అత్యవసర బుకింగ్ రూ.10,500 నుంచి రూ.14,500గా ఉంది. అడ్వాన్స్ బుకింగ్ రూ.4,600 నుంచి రూ.5,500 మధ్యలో..
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

