Lakshya Gamanam At Box office |లక్ష్య, గమనం చిత్రాలెలా ఉన్నాయి..?
ఇవాళ మోస్ట్ ఎవెయిటెడ్ టాలీవుడ్ చిత్రా లు లక్ష్య (Lakshya), గమనం (Gamanam) ప్రేక్షకుల ముందుకొచ్చాయి. చాలా కాలం తర్వాత వచ్చిన ఈ రెండు చిత్రాలపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. మరి ఈ రెండు చిత్రాలు బాక్సాపీస్ వద్ద ఎలాంటి టాక్ తెచ్చుకున్నాయనేది సంక్షిప్తంగా..

బాలకృష్ణ నటించిన అఖండ సినిమాతో ప్రేక్షకులు మళ్లీ థియేటర్లకు వస్తారన్న ధీమా దర్శకనిర్మాతలకు కలిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల కురిపిస్తూ మళ్లీ థియేటర్లు మునుపటిలా సందడిగా మారడం ఖాయమనే ఆశాభావాన్ని కలిగిస్తోంది. కాగా ఇవాళ మోస్ట్ ఎవెయిటెడ్ టాలీవుడ్ చిత్రా లు లక్ష్య (Lakshya), గమనం (Gamanam) ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వీటిలో నాగశౌర్య నటించిన లక్ష్య..స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో ఆర్చరీ (విలువిద్య) వచ్చింది. కాగా ప్రేమ, పేదరికం, ఆకలి, మోసం, పరువు, ఆశలు, ఆశయాలు లాంటి పలు ఎమోషన్స్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం గమనం. చాలా కాలం తర్వాత వచ్చిన ఈ రెండు చిత్రాలపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. మరి ఈ రెండు చిత్రాలు బాక్సాపీస్ వద్ద ఎలాంటి టాక్ తెచ్చుకున్నాయనేది సంక్షిప్తంగా..

Lakshya | స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ స్టోరీ కొత్తేమీ కాదు..కానీ
లక్ష్య..స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో తెలుగులో సినిమాలు రావడం ఇదే కొత్తేమీ కాదు. ఇప్పటికే క్రికెట్, బాక్సింగ్, రన్నింగ్, హాకీ నేపథ్యంలో సినిమాలొచ్చాయి.దాదాపు ఈ సినిమాలన్నీ సక్సెస్ అందుకున్నాయి. అయితే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో ఆర్చరీ నేపథ్యంలో సినిమా రావడం ఇదే తొలిసారి కావడం..ఇలాంటి నేపథ్యం ఉన్న సినిమానే నాగశౌర్య ఎంపిక చేసుకోవడం ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. విలువిద్య మనదేశంలో పుట్టినే క్రీడే అయినా..దీనికి అంత స్థాయిలో ఆదరణ లేదు. ఆర్చరీ అంటే ఆసక్తి చూపే వారు కూడా తక్కువే అని చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్చరీ స్టోరీని సినిమాగా చేసే సాహసం చేసిన డైరెక్టర్ సంతోష్ (santhossh Jagarlapudi), నాగశౌర్య (Naga Shaurya)ను ప్రశంసిస్తున్నారు సినీ జనాలు. అయితే సినిమాను ప్రేక్షకులకు కావాల్సిన ఎలిమెంట్స్ ను అందించడంలో వెనకబడిందని పలువురు ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. మరి లక్ష్య ఎలాంటి కలెక్షన్లు వసూలు చేస్తుందనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.

Gamanam | గమనం ఎలా ఉందంటే..?
మూడు విభిన్న నేపథ్యాలున్న కథలను గమనం చిత్రంతో తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు డైరెక్టర్ సుజనారావు (Sujana Rao). ఈ చిత్రంలో శ్రియ దివ్యాంగురాలైన కమల పాత్రలో నటించింది. శ్రియ తన పాత్రకు ప్రాణం పోసిందని అంటున్నారు సినీ జనాలు. మరోవైపు క్రికెటర్ అవ్వాలని కలలు కనే ముస్లిం యువకుడు అలీగా కనిపించాడు శివ కందకూరి. అతడిని ప్రేమించే యువతిగా ప్రియాంకా జవాల్కర్ కనిపించింది. ఈ ఇద్దరు తమ తమ పాత్రల్లో మెప్పించారు. ఇక బిత్తిరి సత్తి రోడ్డుపై బొమ్మలమ్ముకునే వ్యక్తిగా మెప్పించాడు. మరోవైపు నిత్యమీనన్ గెస్ట్ రోల్లో ఆకట్టుకుంది. మరి డిఫరెంట్ స్టోరీలను సుజనారావు తెరపై ఎలా ఆవిష్కరించారో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి..
Bheemla Nayak | ‘భీమ్లానాయక్’లో పాటపాడిన దుర్గవ్వకు సన్మానం
Sara Ali Khan Heartfelt Note | సారా అలీఖాన్ భావోద్వేగ పోస్ట్..కారణమిదే
Bheemla Nayak Legendary actor | భీమ్లా నాయక్‌లో లెజెండరీ నటుడు..ఎవరో తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

