రాజేష్ మేరు, నవ్య చిట్యాల జంటగా నటిస్తున్న చిత్రం ‘లగ్గం టైం’. ప్రజోత్ కె వెన్నం దర్శకుడు. కె.హిమబిందు నిర్మాత. ఈ నెల 6న విడుదలకానుంది. ఆదివారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అంతా కొత్తవాళ్లతో ఈ సినిమా తీశామని, పెళ్లి నేపథ్యంలో ఆద్యంతం వినోదప్రధానంగా సాగుతుందని దర్శకుడు తెలిపారు.
ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్గా అందరికి ఆకట్టుకునే సినిమా ఇదని నిర్మాత కె.హిమబిందు తెలిపారు. నెల్లూరు సుదర్శన్, ప్రీతీ సుందర్, ప్రణీత్ రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పవన్ గుంటుకు, సంగీతం: పవన్, రచన-దర్శకత్వం: ప్రజోత్ కె వెన్నం.