టాలీవుడ్ (Tollywood) హీరో నాగార్జున (Nagarjuna), డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ (Kalyan Krishna) కాంబోలో వస్తున్న చిత్రం బంగార్రాజు (Bangarraju). ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్ డేట్ బయటకు వచ్చింది. బంగార్రాజులో లడ్డుందా అంటూ (Laddunda lyrical video song) వచ్చే తొలి పాట ఎప్పుడొస్తుందనే అప్ డేట్ ఇచ్చారు. ఈ నెల 9న ఉదయం 9:09 గంటలకు పాటను విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రోమో ద్వారా ప్రకటించారు. ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు.
బాబు తబలా..అబ్బాయి హార్మోని..తాన న న న న..డాంటకు డడనా..అంటూ నాగార్జున వాయిస్ ఓవర్‌తో షురూ అయింది ప్రోమో. ఈ పాటను ఖచ్చితంగా థియేటర్లలో అందరితో ఈలలు వేయించడం ఖాయమని ప్రోమోతో తెలిసిపోతుంది. స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనకలతో బంగార్రాజు సందడి ఉంటుందని సాంగ్ పోస్టర్ ద్వారా తెలియజేశారు.
అనూప్ రూబెన్స్ ఈ పాటను కంపోజ్ చేశాడు. బంగార్రాజు మూవీని 2022 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బంగార్రాజులో నాగచైతన్య కీ రోల్ పోషిస్తుండగా..కృతిశెట్టి అతడితో రొమాన్స్ చేయనుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Rana: ఒక్క పోస్ట్‌తో ముగ్గురు సెలబ్రిటీలకు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపిన రానా
Kamal Hassan: తన బర్త్ డే సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ పెట్టిన కమల్ హాసన్
Pawan Kalyan: లాలా భీమ్లా సాంగ్ విడుదల.. పవన్ అభిమానులకి పూనకాలే..!