Lavanya | సంగారెడ్డిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కలకలం .. హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య హల్చల్
Lavanya | సంగారెడ్డి జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ ఘటన కలకలం రేపింది. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య మద్యం మత్తులో నడి రోడ్డుపై హల్చల్ చేయడం స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటన మల్లేపల్లి గ్రామ పరిసరాల్లో చోటుచేసుకుంది.స్థానికుల కథనం ప్రకారం, లావణ్య మద్యం సేవించి కారు నడుపుతూ వెళ్తుండగా ఒక బైక్‌ను ఢీకొట్టింది.
Lavanya | సంగారెడ్డి జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ ఘటన కలకలం రేపింది. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య మద్యం మత్తులో నడి రోడ్డుపై హల్చల్ చేయడం స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటన మల్లేపల్లి గ్రామ పరిసరాల్లో చోటుచేసుకుంది.స్థానికుల కథనం ప్రకారం, లావణ్య మద్యం సేవించి కారు నడుపుతూ వెళ్తుండగా ఒక బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగినప్పటికీ కారు ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించింది. అయితే అప్రమత్తమైన గ్రామస్తులు వెంటనే స్పందించి ఆమె కారును అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా లావణ్య, స్థానికుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆమెతో పాటు కారులో మరో వ్యక్తి కూడా ఉన్నట్లు సమాచారం. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం లావణ్యకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహించగా, ఆమె మద్యం సేవించినట్లు నిర్ధారణ అయింది. దీంతో పోలీసులు ఆమె కారును సీజ్ చేసి, కేసు నమోదు చేశారు. తర్వాత లావణ్యను కొండాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.
ఈ ఘటనతో లావణ్య మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే వ్యక్తిగత వివాదాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్న ఆమె, ఈసారి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుతో మరింత వివాదాస్పదంగా మారింది. కొద్ది రోజుల క్రితం రాజ్ తరుణ్‌పై అనేక ఆరోపణలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక హీరో రాజ్ తరుణ్ విషయానికి వస్తే, షార్ట్ ఫిల్మ్స్ ద్వారా కెరీర్ ప్రారంభించి ‘ఉయ్యాల జంపాల’, ‘సినిమా చూపిస్త మామ’ వంటి హిట్ చిత్రాలతో గుర్తింపు పొందాడు. అయితే తర్వాత వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేదు.
మద్యం మత్తులో రాజ్‌తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య హల్చల్!!
సంగారెడ్డి ముత్తపల్లిలో బైక్‌ను ఢీకొట్టి పరారయ్యే ప్రయత్నం… గ్రామస్తులు అడ్డుకున్నారు.#Rajtharun #Lavanya pic.twitter.com/TSHZfnLAIq
— Milagro Movies (@MilagroMovies) March 25, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

