Kushi | టాలీవుడ్ యాక్టర్ విజయ్ దేవరకొండ (Vijay deverakonda) నటిస్తున్న తాజా చిత్రం ఖుషి (Kushi). నిన్ను కోరి, మజిలీ లాంటి సక్సెస్ఫుల్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన శివనిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వం వహిస్తున్నాడు. సమంత (Samantha) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఇప్పటికే ఖుషి నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లతోపాటు ఫస్ట్ సింగిల్ నా రోజా నువ్వే (Na Rojaa Nuvve), ఆరాధ్య పాటలకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. నా రోజా నువ్వే మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ ట్రెండింగ్ సాంగ్స్ జాబితాలో టాప్‌లో నిలుస్తోంది.
కాగా మేకర్స్ ఈ మూవీ నుంచి థర్డ్ సింగిల్ అప్డేట్ అందించారు. ఖుషి టైటిల్ సాంగ్ (Kushi Title song)ను జులై 28న లాంఛ్ చేస్తున్నట్టు తెలియజేశారు. బ్లూ డ్రెస్‌లో ఛిల్ అవుట్ మూడ్‌లో ఉన్న విజయ్ దేవరకొండ లుక్ ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ హేశమ్ అబ్ధుల్ వహబ్ టీం ఇప్పటికే ఖుషి నువ్ కనబడితే.. ఖుషి నీ మాట వినబడితే.. అంటూ సాగే ట్యూన్‌తో అదిరిపోయే మ్యూజికల్ అప్డేట్ అందించాడు. ఈ ట్యూన్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మ్యూజిక్ లవర్స్.
ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఖుషి చిత్రాన్ని సెప్టెంబర్ 1న సినిమా విడుదల చేస్తున్నట్టు తెలియజేస్తూ లాంఛ్ చేసిన స్పెషల్ పోస్టర్ అందరినీ ఇంప్రెస్ చేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో ఈ చిత్రంలో సచిన్ ఖడేకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కన్నడ యాక్టర్ జయరాం, శరణ్య ప్రదీప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఖుషి టైటిల్ సాంగ్ అప్డేట్..
The Title song#Kushi ❤️
On 28th July. pic.twitter.com/CKh82Ss3JK
— Vijay Deverakonda (@TheDeverakonda) July 24, 2023
ఖుషి నువ్ కనబడితే ట్యూన్..
Get ready for a Musical Blast 🎧❤️🔥
Audio rights of #Kushi bagged by @saregamasouth 🎼
Music by the young sensation @HeshamAWMusic ❤️#Kushi @TheDeverakonda @Samanthaprabhu2 @ShivaNirvana @prawinpudi @saregamaglobal pic.twitter.com/rr9gH6k3Un
— Mythri Movie Makers (@MythriOfficial) May 3, 2023
సామ్‌కు బై చెప్తూ..
Experience the Magic of Two Worlds Falling for Each Other ♥#Kushi in cinemas from 1st SEPTEMBER 2023 ❤️🔥@TheDeverakonda @Samanthaprabhu2 @ShivaNirvana @HeshamAWMusic @prawinpudi pic.twitter.com/C2VGk6uJPz
— Mythri Movie Makers (@MythriOfficial) March 23, 2023