Kushi Movie | లైగర్ వంటి అల్ట్రా డిజాస్టర్ పడినా ఖుషీ సినిమాకు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ సాధించాడు విజయ్ దేవరకొండ. నిజానికి ఈ సినిమాకు ముందు నుంచి పాజిటీవ్ హైపే నెలకొంది. దానికి తోడు పాటలు, ట్రైలర్ ఒక దానికి మించి మరొకటి జనాల్లో తిరుగులేని హైప్ నెలకొల్పాయి. సెప్టెంబర్ 1న సోలోగా రిలీజైన ఈ సినిమాకు మరీ అంత పాజిటీవ్ రివ్యూలు ఏమి రాలేవు కానీ.. ఒక్కసారి హ్యాపీగా చూసేయొచ్చు అనే టాక్ మాత్రం తెచ్చుకుంది. దాంతో ఫ్యామిలీ ఆడియెన్స్ సహా యూత్ థియేటర్ల వైపు పరుగులు తీశారు. తొలిరోజు రూ.30 కోట్ల రేంజ్లో కలెక్షన్లు కొల్లగొట్టి విజయ్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి నిరూపించాడు. ఇక వరుసగా రెండు, మూడు రోజులు ఊహించని రేంజ్లో కలెక్షన్లు కొల్లగొట్టింది.
అయితే వీక్ డేస్‌లో మాత్రం ఈ సినిమా మరీ వీక్ అయిపోయింది. ఎంతలా ఉంటే మూడు రోజుల్లో రూ.70 కోట్లు కొల్లగొట్టిన సినిమా.. ఇప్పటివరకు పట్టు మని పది కొట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది. దాదాపుగా ఈ సినిమా ఫైనల్ దశకు వచ్చేసింది. ఫైనల్ రన్లో కనీసం పది కోట్ల నష్టాన్నైనా ఈ సినిమా మిగిల్చుతుందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. కాగా ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని డిజిటల్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్‌కు సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ఖుషి సినిమా రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. కాగా అక్టోబర్ 6 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే చాన్స్ ఉంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించింది. మైత్రీ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వాహద్ స్వరాలు సమకూర్చాడు.