శర్వానంద్ సినిమాలో ముగ్గురు ఎవర్గ్రీన్ హీరోయిన్లు
ఆడవాళ్లు మీకు జోహార్లు | పేరుకు తగ్గట్టుగానే ఈ సినిమాలో మూడు మహిళా పాత్రలు కీలకంగా ఉండబోతుంది. ఆ పాత్రల్లో సీనియర్ హీరోయిన్లు నటిస్తున్నారు.

శర్వానంద్, రష్మిక జంటగా నటిస్తున్న తాజా చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ సినిమా టైటిల్ ప్రకటించినప్పటి నుంచే ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ టైటిల్ చూస్తుంటే.. సినిమా ఆడవాళ్ల గురించే ఉంటుందని అర్థమవుతోంది. ఇది ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుందని ఇప్పటికే దర్శకుడు కిశోర్ తిరుమల చెప్పాడు. ఇదిలా ఉంటే.. పేరుకు తగ్గట్టుగానే ఈ సినిమాలో మూడు మహిళా పాత్రలు కీలకంగా ఉండబోతుంది. ఆ మూడు పాత్రల్లో ముగ్గురు సీనియర్ హీరోయిన్లు నటిస్తున్నారు. అప్పట్లో టాప్ హీరోయిన్లుగా చెలామణీ అయిన ఖుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశి ఈ పాత్రల్లో నటిస్తున్నారు.

ఇప్పటికే కొంత భాగం సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా ఆగిపోయింది. సెకండ్ వేవ్ తగ్గిన తర్వాత తిరిగి ఈ సినిమా సెట్స్‌పైకి వచ్చింది. ఈ షెడ్యూల్లో శర్వానంద్, రష్మిక మధ్య కీలక సన్నివేశాలతో పాటు కుటుంబ నేపథ్యంలో వచ్చే సీన్లను తెరకెక్కించబోతున్నారు. ఈ షూటింగ్లో ఖుష్బూ, రాధిక, ఊర్వశి కూడా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఆహ్వానిస్తూ ఫిల్మ్ మేకర్స్ వారి పోస్టర్లను రిలీజ్ చేశారు. ఈ సీనియర్ నటీమణుల ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సెంటిమెంట్ సీన్లలో వీళ్లు జీవించేస్తారు. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాకి ఈ ముగ్గురి పాత్రలే చాలా కీలకమని.. అందుకే వీరిని ఎంపిక చేసుకున్నట్లు టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ నేపథ్యంలో సీనియర్ హీరోయిన్లపై తన గౌరవాన్ని చాటుకున్నాడు హీరో శర్వానంద్. తన ఇంటి నుంచి తీసుకొచ్చిన ఫుడ్‌ను స్వయంగా ఈ ముగ్గురు సీనియర్ హీరోయిన్లకు వడ్డించి తన సింప్లిసిటీని చాటుకున్నాడు. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

శర్వానంద్, రష్మిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు.. మరి ఆచార్య, పుష్ప పరిస్థితేంటి?
సంక్రాంతికి స్టార్ వార్.. పండక్కి క్యూ కట్టిన బడా హీరోలు
Monal Gajjar | మోనాల్ గజ్జర్ ఖాతాలో భారీ ఆఫర్..?
వైట్ డ్రెస్‌లో ఏంజెల్లా కనిపిస్తున్న కియారా
పెళ్లి తిరుపతిలో, సంగీత్ చెన్నైలో అని చెప్పిన జాన్వీ కపూర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

