Kushboo | కోలీవుడ్‌లో సీనియర్ హీరోయిన్గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఖుష్బూ సుందర్ తెలుగు ప్రేక్షకులకు కూడా మంచి పరిచయం ఉన్న పేరు. సినిమా పాత్రలతో పాటు, ‘జబర్దస్త్’ వంటి టీవీ షోలో జడ్జిగా మెరిసిన ఆమె, తాజాగా సోషల్ మీడియాలో పూజా వేడుకల్లో పాల్గొన్న ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేసింది. అవి ప్రస్తుతం వైరల్‌గా మారాయి. వినాయక చవితి సందర్భంగా ఖుష్బూ తన భర్త సుందర్ సి, కుమార్తెలు అవంతిక మరియు ఆనందితతో కలిసి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు చూసిన నెటిజన్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కారణం? ఖుష్బూ ఫ్యామిలీ మొత్తం ఒకేసారి బరువు తగ్గినట్లు కనిపిస్తున్నారు!
ఇంతకముందు చాలా లావుగా కనిపించిన ఖుష్బూ కుమార్తెలు ఇప్పుడు స్లిమ్ అండ్ స్టైలిష్ లుక్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. మేకోవర్‌తో పాటు వారి స్మార్ట్ నెస్ చూసి కొంతమంది నెటిజన్లు ష కొత్త హీరోయిన్లా ఉన్నారు” అని కామెంట్లు పెడుతున్నారు. ఫ్యామిలీ అంతా ఇలా ఒక్కసారిగా స్లిమ్ అవడం వెనక అసలు రహస్యమేంటి అని నెటిజన్లు ఆసక్తిగా ప్రశ్నిస్తున్నారు. ‘‘ఏ డైట్ ఫాలో అయ్యారో చెప్పండి ప్లీజ్’’, ‘‘ఇది అసలు ఎలా సాధ్యమైంది?’’ అంటూ కామెంట్లతో ఖుష్బూ పోస్ట్‌ను ముంచెత్తుతున్నారు. ఈ ఫోటోలు శుభాకాంక్షలతో పాటు వెయిట్ లాస్ గోల్ అని పిలవబడి ట్రెండింగ్‌లోకి వచ్చాయి. గతంలోనూ ఖుష్బూ కొన్నిసార్లు తన ఆరోగ్య పయనంపై సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే.
కానీ ఈసారి ఫ్యామిలీ అంతా మారిపోయి కనిపించడం నెట్లో హాట్ టాపిక్ అయింది. ఇక నెటిజన్లంతా ఖుష్బూ ఫ్యామిలీ డెడికేషన్‌ను ప్రశంసిస్తూ, వారి “ఫిట్నెస్ జర్నీ” కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికోసం ఈ నలుగురు జిమ్, డైట్ తో బాగా కష్టపడ్డారని అర్ధమవుతుంది.. ఖుష్బూ ఓ పక్క టీవీ షోలు చేస్తూనే రాజకీయాల్లో బీజేపీ తరపున యాక్టివ్ గా ఉంది. ఆమె భర్త సుందర్ ఓ పక్క నటిస్తూనే వరుసగా డైరెక్టర్ గా సినిమాలు కూడా చేస్తూ అలరిస్తున్నాడు. ఇక కుష్బూ పెద్ద కూతురు అవంతిక సినిమాల్లోకి వస్తుందని ప్రచారం సాగుతుంది. చిన్న కూతురు ఆనందిత ప్రస్తుతం చదువుకుంటుంది.