‘నాది నాది ఈ లోకమంతా నాదే..’ అంటూ ఇటీవల విడుదలైన ఓ పాటతో ‘కుబేర’ సినిమా సారాంశాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఈ ప్రపంచంలో వేళ్లూనుకుపోయిన స్వార్థం, దురాశ, ఆర్థిక అంతరాలను ప్రధాన వస్తువులుగా తీసుకొని ఆయన ఈ సినిమాను తెరకెక్కించారని అర్థమవుతున్నది. నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ‘కుబేర’ ఈ నెల 20న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ నేపథ్యంలో ప్రచారపర్వంలో జోరు పెంచారు. తాజాగా ఈ సినిమాకు నాగార్జున డబ్బింగ్ పూర్తి చేశారు. ఈ ఫొటోలను చిత్రబృందం పంచుకుంది. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తున్నదని, సామాజికాంశాల మేళవింపుతో సోషల్డ్రామాగా దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడని మేకర్స్ తెలిపారు. అమిగోస్ క్రియేషన్స్, ఎస్వీసీ పతాకాలపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు.