Kubera | శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రలలో రూపొందిన ‘కుబేర’ జూన్ 20న విడుదలైన విషయం తెలిసిందే. క్రేజీ కాంబినేషన్ కావడంతో సినిమాపై ముందునుండే అంచనాలు భారీగా ఉన్నాయి.ఇక ప్రచార చిత్రాలు కూడా ఆ అంచనాలను పదింతలు చేశాయి. బిచ్చగాడికి, కుబేరుడికి మధ్య సాగే పోరాటం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కగా, ఇందులో ధనుష్ తన నటనతో అదరగొట్టేశాడు. బిచ్చగాడిగా పాత్రలో జీవించేశాడు. ధనుష్‌పై అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మరోవైపు నాగార్జున, రష్మికల పర్ఫార్మెన్స్ని కూడా ఆకాశానికి ఎత్తుతున్నారు.
అయితే కుబేర.. కథ పరంగా బలమైనదే అయినా, దాన్ని అంత బలంగా చెప్పడంలో దర్శకుడు కొంత తడబడ్డాడనే టాక్ ఎక్కువగా వినిపిస్తుంది. సినిమాని ఎక్కువగా సాగదీయడం మైనస్ అయిందని అంటున్నారు. సినిమా నడక కూడా స్లోగా సాగడంతో ఒక దశలో ఆడియన్స్ కాస్తంత ఇబ్బందిపడ్డారనే చెప్పాలి. పెట్టుబడి దారుల కబందహస్తాల్లో దేశం నలిగిపోతున్నదని, సామాన్యుల జీవితాలు ఈ కారణంగా చితికిపోతున్నాయని చెప్పే ప్రయత్నం చేశాడు శేఖర్ కమ్ముల.జీవితంలో ఎలాంటి లక్ష్యాలూ లేని ఓ బిచ్చగాడు, నిజాయితీని నమ్ముకొని జైలు పాలైన ఓ ప్రభుత్వ ఉద్యోగి. వీరిద్దరి మధ్య డబ్బే ఊపిరిగా బతికే ఓ అవినీతిపరుడు. ఈ ముగ్గురు మధ్య నడిచే డ్రామా ఆసక్తికరంగానే ఉంది. కాకపోతే ఇందులో ఎలాంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్లు లేవని అంటున్నారు.
అయితే కుబేర మూవీకి బిజినెస్‌కి సంబంధించిన లెక్కలు ఇప్పుడు ఆశ్చర్యపరుస్తున్నాయి. సినిమాని భారీ రేట్‌కే అమ్మేసినట్టు తెలుస్తోంది. ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ.58.9కోట్ల థియేట్రికల్ బిజినెస్ అయినట్టు సమాచారం. అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే సుమారు రూ.120కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టాల్సి ఉంది. తొలి రోజు అయితే ఓపెనింగ్స్ బాగానే వస్తాయని తెలుస్తుంది. వీకెండ్లో ఎంత రాబడుతుందో చూడాలి. ఇక ఏరియా వైజ్‌గా థియేట్రికల్ బిజినెస్ చూస్తే నైజాంలో రూ.12కోట్లు, సీడెడ్‌లో నాలుగు కోట్లు, ఉత్తరాంధ్ర నాలుగు కోట్లు, ఈస్ట్ గోదావరి రూ.2.2 కోట్లు, వెస్ట్ గోదావరి రెండు కోట్లు, కృష్ణా రూ.2.05కోట్లు, నెల్లూరు రూ.1.2 కోట్ల బిజినెస్ అయ్యిందట. ఇలా ఏపీ, తెలంగాణలో 30 కోట్ల బిజినెస్ అయ్యిందని, తమిళనాడులో రూ.15కోట్లు, కన్నడ, మలయాళం, నార్త్ కలిసి ఆరు కోట్లు అని, ఓవర్సీస్లో రూ.8కోట్ల బిజినెస్ జరిగిందని సమాచారం.