KTR’s Son Himanshu Rao | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనయుడు, కల్వకుంట్ల హిమాన్షు రావు గచ్చిబౌలిలోని ఏఐజీ (AIG) ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల హిమాన్షు వ్యాయామం చేస్తుండగా లేదా క్రీడలు ఆడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు కిందపడటంతో ఆయన ముక్కుకు స్వల్ప గాయమైంది. దాంతో కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన విషయం తెలియగానే కేటీఆర్, హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఆసుపత్రికి చేరుకుని హిమాన్షును పరామర్శించి, వైద్యులను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
అయితే హిమాన్షు ఆరోగ్య పరిస్థితి మెరుగపడడంతో గురువారం డిశ్చార్జ్ అయినట్లు తెలుస్తుంది. మరోవైపు హిమాన్షుకు జరిగింది చిన్నపాటి గాయమేనని, ఆందోళన చెందాల్సిన పనిలేదని.. మరికొద్ది రోజుల్లోనే ఆయన పూర్తి సాధారణ స్థితికి చేరుకుంటారని కేటీఆర్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం హిమాన్షు తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.