ICC | స్టోక్స్ వీడ్కోలు వీడియోపై ఐసీసీ ఆగ్రహం.. ఇంగ్లండ్ బోర్డుకు నోటీసులు..!
ICC : అంతర్జాతీయ క్రికెట్‌కు హఠాత్తుగా వీడ్కోలు పలికి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు బెన్ స్టోక్స్(Ben Stokes). అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) సైతం అతడలా రిటైర్మెంట్ ప్రకటన చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ICC : అంతర్జాతీయ క్రికెట్‌కు హఠాత్తుగా వీడ్కోలు పలికి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు బెన్ స్టోక్స్(Ben Stokes). స్వదేశంలో టెస్టు మ్యాచ్ మధ్యలోనే అతడు ఆటను వదిలేస్తున్నాని చెప్పడంతో క్రికెట్ లోకం కంగుతిన్నది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) సైతం అతడలా రిటైర్మెంట్ ప్రకటన చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మూడో టెస్టు మధ్యలోనే స్టోక్స్ తనకు ఇదే చివరి మ్యాచ్ అని సహచరులకు చెప్పడం, ఆ వీడియో వైరలవ్వడంపై గుర్రుమన్న ఐసీసీ సత్వరమే వివరణ ఇవ్వాలని ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డును కోరింది
ట్రెంట్ బ్రిడ్జ్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య మూడో టెస్టు నాలుగోరోజు బెన్ స్టోక్స్ వీడ్కోలు వార్త బయటకొచ్చింది. ఆ రోజు ఆట మొదలవ్వడానికి ముందే డ్రెస్సింగ్ రూమ్‌లో స్టోక్స్ తనకు కెప్టెన్‌గా ఇదే చివరి మ్యాచ్ అని సహచరులకు చెప్పాడు. అతడు తన వీడ్కోలు గురించి వెల్లడిస్తుండగా ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు మీడియా బృందం వీడియో రికార్డు చేసింది. అదేరోజు టీ విరామం సమయంలో సోషల్ మీడియాలో, టీవీ ఛానెళ్లలో స్టోక్స్ రిటైర్మెంట్ వార్త పొక్కింది.
The ICC has contacted the ECB over Ben Stokes’ retirement announcement being made public during the third Test against New Zealand.
Stokes’ dressing-room speech was filmed and released with audio before the match had concluded.
The ICC alleges this breached its Players’ & Match…
— Cricketopia (@CricketopiaCom) July 9, 2026
మ్యాచ్ జరుగుతుండగానే స్టోక్స్ వీడ్కోలు వీడియో బయటకు రావడంపై ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆటగాడు, మ్యాచ్ అధికారులకు సంబంధించిన(PMOA) నిబంధలన ప్రకారం బెన్ స్టోక్స్ ఉల్లంఘనకు పాల్పడ్డాడని, ఈసీబీ కూడా ఇందులో హద్దు మీరిందని ఐసీసీ పేర్కొంది. మ్యాచ్ సమయంలో.. డ్రెస్సింగ్ రూమ్‌లో ఇలాంటివి రికార్డు చేయడం పీఎమ్ఓఏ నిబంధలన అతిక్రమణ కిందకు వస్తుందని తేల్చిన అత్యున్నత క్రికెట్ మండలి.. ఈసీబీకి నోటీసులు పంపింది. ఐసీసీ వైరల్ వీడియోపై వివరణ కోరడంపై స్టోక్స్ నెట్టింట సెటైర్ వేశాడు. అతడిపై వేటు వేయండి అని ట్వీట్ చేశాడు. అయితే.. ఈసీబీ మాత్రం ఇంకా స్పందించాల్సి ఉంది.
England have been accused of breaching rules related to Test cricket’s anti-corruption code by posting a video of Ben Stokes sharing news of his retirement to his team-mates. 😱🏏
📸: ECB/X#trending #benstokes #englandcricket #icc #cricket pic.twitter.com/xy0I7K9h3Z
— OneTurf News (@oneturf_news) July 9, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Ben Stokes
- ICC
- NZ vs ENG
- PMOA
RELATED ARTICLES
తాజా వార్తలు
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
Vijay Deverakonda | ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊరట.. వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు తీర్పు
Nani Movie | గ్యాంగ్‌స్టర్ మోడ్‌లోకి నాని.. సుజీత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ షూటింగ్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

