నేడు (ఆగస్ట్ 9) సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెలువెత్తుతున్నాయి. సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులే కాక రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన వారు కూడా విషెస్ అందిస్తున్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మహేష్ బాబుకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. చాలా సందర్భాలలో వారిద్దరు స్నేహ భావంతో మెలగడం మనం చూశాం.
తాజాగా కేటీఆర్.. మహేష్‌కి విషెస్ తెలియజేస్తూ, నాకు తెలిసిన నైసెస్ట్ సూపర్ స్టార్, ఎప్పటికి యువకుడిగా కనిపించే మహేష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు.. ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలి బ్రదర్ అని తన కామెంట్లో రాసారు. ఈ ట్వీట్ నెటిజన్స్‌ని ఎంతగానో అలరిస్తుంది.
మెగాస్టార్ చిరంజీవి కూడా మహేష్‌కు తన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. హ్యాపీ బర్త్ డే టు ఎవర్గ్రీన్ ఛార్మర్. ఇది మీకు బ్లాక్ బస్టర్ ఇయర్ కావాలి.” అంటూ చిరు తన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ రోజు మహేష్ బర్త్ డే సందర్భంగా విడుదలైన సర్కారు వారి పాట బ్లాస్టర్ వీడియో అభిమానులకి మంచి ట్రీట్‌గా మారింది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఇందులో ‘మహానటి’ కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తోంది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 13, 2022న భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.
Happy birthday to the nicest superstar I know & the forever young @urstrulyMahesh 🌟
— KTR (@KTRTRS) August 9, 2021
Many returns of the day brother
Happy Birthday to the Evergreen Charmer SSMB @urstrulyMahesh ! A lethal combo of Style and Substance! Have a Blockbuster year ahead! 💐💐 Many Many Happy Returns!
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 9, 2021