హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తేతెలంగాణ): ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ మాతృమూర్తి కనకరత్నమ్మ ఇటీవల మరణించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో సోమవారం నిర్వహించిన ఆమె దశదినకర్మకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కనకరత్నమ్మ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.
అనంతరం అల్లు అరవింద్, అల్లు అర్జున్‌తో పాటు వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. అలాగే ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు జి.జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్ కనరత్నమ్మకు నివాళులర్పించారు.