Kriti Shetty | మంగళూరు సోయగం కృతిశెట్టికి అవకాశాలైతే వస్తున్నాయి కానీ.. ఆశించిన స్థాయిలో విజయాలు మాత్రం దక్కడం లేదు. ఏడాదికాలంగా తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఈ అమ్మడు ఇక్కడ భారీ అవకాశం కోసం ఎదురుచూస్తున్నది. తాజా సమాచారం ప్రకారం కృతిశెట్టి టాలీవుడ్లో బంపరాఫర్‌ను సొంతం చేసుకున్నట్లు తెలిసింది. యువ హీరో విశ్వక్సేన్తో జోడీ కట్టబోతున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే… ‘జాతిరత్నాలు’ ఫేమ్ కేవీ అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్సేన్ ఓ చిత్రాన్ని చేయబోతున్నాడు.
‘వీఎస్ 14’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా తాలూకు అనౌన్స్మెంట్ ఆగస్ట్‌లో వెలువడింది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో కృతిశెట్టిని కథానాయికగా ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ విషయంలో ఇప్పటికే సంప్రదింపులు పూర్తయ్యాయని, త్వరలో మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వస్తుందని చెబుతున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని నాన్‌స్టాప్ వినోదంతో ఆకట్టుకుంటుందని మేకర్స్ అంటున్నారు. ప్రస్తుతం కృతిశెట్టి తమిళంలో మూడు చిత్రాలతో బిజీగా ఉంది.