Kriti Sanon | బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న కృతి సనన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టిన కృతి, తెలుగు ప్రేక్షకులకు ‘1: నేనొక్కడినే’ సినిమాతో పరిచయమైంది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన నటించి అలరించింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం చవి చూసింది.ఇక ఆ తర్వాత బాలీవుడ్లో ‘హీరోపంతి’, ‘మిమీ’ వంటి హిట్స్‌తో స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరింది. మిమీ చిత్రంలో సరోగేట్ మదర్ పాత్రకు ఆమె జాతీయ అవార్డు అందుకోవడం పెద్ద హైలైట్‌గా నిలిచింది.
అయితే తాజాగా కృతి సనన్ ధనుష్‌తో చేసిన ‘తేరే ఇష్క్ మే’ ప్రమోషన్ల సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో ఇచ్చిన సమాధానం ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతోంది. యాంకర్ ఆమె హైట్ గురించి ప్రశ్నించగా, కృతి నవ్వుతూ…“నేను కొంచెం ఎత్తుగా ఉంటాను. చాలా మంది హీరోలు నాకన్నా పొట్టిగా ఉన్నారు. ప్రభాస్, అర్జున్ కపూర్ మాత్రం నాకన్నా పొడుగుగా ఉంటారు” అని చెప్పింది. దీంతో మహేష్ బాబు అభిమానులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ‘1: నేనొక్కడినే’ ద్వారా ఆమెకు గుర్తింపు వచ్చినప్పటికీ, తన తొలి తెలుగు హీరో మహేష్ బాబు పేరే ప్రస్తావించలేదని అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో కృతిని ట్యాగ్ చేస్తూ…తొలి సినిమా హీరోని మర్చిపోవడం తప్పు. గుర్తింపు ఇచ్చిన వ్యక్తికి క్రెడిట్ ఇవ్వకపోవడం అవమానమే, మహేష్ బాబు పేరును పలకడానికి కూడా ఇష్టపడలేదా?” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వివాదం చర్చనీయాంశం కాగా, ట్రోలింగ్ మరింత పెరుగుతోంది. దీంతో కృతి సనన్ ఈ అంశంపై రియాక్ట్ అవుతుందా, లేక నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందా అన్నది ఇప్పుడు ఫ్యాన్స్, నెటిజన్ల మధ్య ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఈ వివాదంపై బాలీవుడ్–టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో కూడా చర్చ నడుస్తుంది.