Kriti Sanon | కథాంశాల ఎంపికలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నది బాలీవుడ్ కథానాయిక కృతిసనన్. యాక్షన్ చిత్రాలతో పాటు లవ్‌స్టోరీస్‌కు ప్రాధాన్యతనిస్తూ కెరీర్లో దూసుకుపోతున్నది. తాజాగా ఈ భామ బాలీవుడ్లో బంపరాఫర్‌ను సొంతం చేసుకుంది. ధనుష్ కథానాయకుడిగా ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో ‘తేరే ఇష్క్ మే’ పేరుతో ఓ సినిమా తెరకెక్కనుంది. ‘రాంజనా’ (2013) తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆసక్తినిరేకెత్తిస్తున్నది.
ఈ సినిమా కోసం కథానాయిక అన్వేషణలో ఉన్న దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ చివరకు కృతిసనన్‌ను ఖరారు చేశారని సమాచారం. ‘రాంజనా’ తరహాలోనే హృద్యమైన ప్రేమకథాంశం కావడంతో కృతిసనన్ వెంటనే ఈ సినిమాకు ఓకే చెప్పిందట. అక్టోబర్‌లో సెట్స్‌మీదకు వెళ్లనున్న ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్నందిస్తున్నారు.