రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ జంటగా రూపొందుతున్న చిత్రం ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’. రాజేష్ దొండపాటి దర్శకుడు. పెట్టా కృష్ణమూర్తి, పెట్టా వెంకట సుబ్బమ్మ, పీఎన్కే శ్రీలత సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇటీవల ఈ చిత్రం టీజర్‌ను దర్శకుడు శ్రీవాస్ విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘రొమాన్స్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ జోడించి రూపొందిస్తున్న చిత్రమిది. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాబు వర్గీస్.