దక్షిణాది సినీ పరిశ్రమ (South Cinema) లో ఉన్న టాలెంటెడ్ యాక్టర్లలో ఒకరు కోవై సరళ (Kovai Sarala). తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకంగా కోట్లాదిమంది అభిమానులకు సంపాదించుకున్నారు. ఈ సీనియర్ నటి ప్రస్తుతం సెంబి (Sembi) అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. అరణ్య ఫేం ప్రభు సోలోమన్ (Prabhu Solomon) దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో అశ్విన్ కుమార్ లీడ్ రోల్ పోషిస్తుండగా..కోవై సరళ కీలక పాత్రలో నటిస్తోంది.
తాజాగా మేకర్స్ స్టన్నింగ్ పోస్టర్‌ను అందరితో పంచుకున్నారు. 70 ఏళ్లకు పైబడిన వృద్దురాలిగా స్కార్ప్లో సీరియస్ షేడ్స్ తో ఉన్న కోవై సరళ ఓ అమ్మాయిని హత్తుకొని ఉన్న ఫస్ట్ లుక్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. కొడైకెనాల్ నుంచి డిండిగుల్కు వెళ్లే ప్రయాణికుల బస్సు జర్నీ నేపథ్యంలో తెరకెక్కుతోంది ఈ చిత్రం. ఈ మూవీ తెలుగులో అదే టైటిల్‌తో థియేటర్లలో సందడి చేయనుంది.
కోవై సరళ డీగ్లామర్ లుక్‌లోకి ట్రాన్స్ ఫార్మేషన్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ స్టన్నింగ్‌గా కనిపిస్తుంది. తంబి రామయ్య, అశ్విన్ కుమార్‌తోపాటు చైల్డ్ ఆర్టిస్ట్ నీల ఈ ప్రాజెక్టులో కీ రోల్ పోషిస్తున్నారు.
Presenting the Title and First Look of my next titled #SEMBI #செம்பி starring #KovaiSarala @i_amak prod by #Ravindran's @tridentartsoffl & #AjmalKhan @actressReyaa's @AREntertainoffl #Jeevan @nivaskprasanna #Buvan #VijayThennarasu @PhoenixPrabu2 @srikrish_dance @onlynikil pic.twitter.com/BCO7eACqYP
— Prabu Solomon (@prabu_solomon) May 20, 2022