Kota Bommali Movie | టాలీవుడ్ హీరో శ్రీకాంత్ (Srikanth Meka), వరలక్ష్మి శరత్‌కుమార్(Varalakshmi), రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ (Shivani Rajashekar) ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’(Kota bommali Ps). మలయాళంలో విజయవంతమైన ‘నయట్టు’ సినిమాకు ఈ సినిమా రీమేక్‌గా వచ్చింది. తేజ మార్ని ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇదిలావుంటే.. తాజాగా ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుంది.
ప్రముఖ తెలుగు ఓటీటీ దిగ్గజం ఆహాలో సంక్రాంతి కానుకగా ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో వెల్లడిస్తూ.. రాజకీయ వ్యవస్థను, నాయకులను ప్రశ్నించి నిలదీసిన ముగ్గురు పోలీసుల కథ ఈ కోట బొమ్మాళి పీఎస్… ఈ సంక్రాంతికి, మీ ఆహలో! అంటూ రాసుకోచ్చింది. గీతాఆర్ట్స్2 పతాకంపై బన్నీ వాసు, విద్య కొప్పినీడి ఈ సినిమాను నిర్మించగా. ఈ చిత్రానికి కెమెరా: జగదీష్ చీకాటి, సంగీతం: రంజిన్ రాజ్, మిధున్ ముకుందన్.
రాజకీయ వ్యవస్థను, నాయకులను ప్రశ్నించి నిలదీసిన ముగ్గురు పోలీసుల కథ ఈ #KotabommaliPS కథ… ఈ సంక్రాంతి కి, మీ ఆహలో!
Adding dose of thrill to your festival movie list 🥳@ahavideoIN @actorsrikanth #BunnyVass #VidyaKoppineedi @DirTejaMarni @GA2Official @varusarath5 @bhanu_pratapa… pic.twitter.com/0ufjGv1ZJL— Vamsi Kaka (@vamsikaka) December 31, 2023
ఈ సినిమా కథలోకి వెళితే.. రామకృష్ణ (శ్రీకాంత్), రవి (రాహుల్ విజయ్) కుమారి(శివాని రాజశేఖర్)లు కోటబొమ్మాళి అనే పోలీస్ స్టేషన్లో పోలీసులుగా పనిచేస్తుంటారు. అయితే వీళ్లు ముగ్గురు కలిసి రాత్రి డిపార్ట్మెంట్కు సంబంధించిన ఒక పెళ్లికి హాజరవుతారు. ఇక ఆ ఫంక్షన్ నుంచి తిరిగి వస్తోన్న క్రమంలో వారి వాహనం గుద్ది యాక్సిడెంట్ వల్ల ఓ వ్యక్తి చనిపోతాడు. దీంతో వీళ్లు ముగ్గురు అక్కడనుంచి పరారీ అవుతారు. అయితే చనిపోయిన వ్యక్తి తక్కువ కులంకు చెందినవాడు అవ్వడంతో అది కాస్తా రాజకీయ రంగు పులుముకుంటుంది. దీంతో ఈ ముగ్గురిని పట్టుకునే బాధ్యతను ప్రభుత్వం ఎస్పీ రజియా అలీకి (వరలక్ష్మి శరత్‌కుమార్) అప్పగిస్తుంది. ఇక ఆ ముగ్గురిని ఎస్పీ రజియా అలీ పట్టుకుంటుందా..? ఈ క్రమంలో రజియాకు ఎదురైన సవాళ్లేంటి? అసలు వాళ్లు ముగ్గురు ఎందుకు పారిపోవాలి అనుకుంటారు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.