వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej), క్రిష్ (krish)కాంబినేషన్ లో వచ్చిన కొండపొలం (Konda Polam) సినిమాను అక్టోబర్ 8న భారీగానే విడుదల చేసారు. ఉప్పెన లాంటి సంచలన సినిమా తర్వాత వైష్ణవ్ నటించిన సినిమా కావడంతో అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. దీనికి బిజినెస్ కూడా పర్లేదు అనే స్థాయిలోనే చేసారు. ఇక విడుదలైన తొలిరోజే సినిమాకు టాక్ బాగానే వచ్చింది. క్రిష్ మంచి ప్రయత్నం చేసాడు కానీ కమర్షియల్ గా వర్కవుట్ అవ్వడం కష్టమే అని ట్రేడ్ పండితులు ముందుగానే కొండపొలం ఫలితంపై అంచనా వేసారు. ఇప్పుడు అదే నిజమైంది. ఈ సినిమాకు మూడు రోజుల్లో కలిపి చాలా తక్కువ వసూళ్ళు వచ్చాయి. ముఖ్యంగా ఉప్పెన సినిమాకు తొలిరోజు వచ్చిన కలెక్షన్స్ కంటే..కొండపొలం సినిమా మూడు రోజుల వసూళ్లలో సగం కూడా రాలేదు. ఉప్పెన తొలిరోజే 10 కోట్ల షేర్ తీసుకొచ్చింది. కానీ కొండపొలం మూడు రోజుల్లో 3 కోట్లు కూడా తీసుకురాలేదు.
ప్రాంతాల వారిగా కలెక్షన్లు..
నైజాం: 0.72 కోట్లు
సీడెడ్: 0.29 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.52 కోట్లు
ఈస్ట్: 0.27 కోట్లు
వెస్ట్: 0.21 కోట్లు
గుంటూరు: 0.32 కోట్లు
కృష్ణా: 0.22 కోట్లు
నెల్లూరు: 0.16 కోట్లు
ఏపీ + తెలంగాణ: 2.71 కోట్లు షేర్
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 0.24 కోట్లు
వరల్డ్ వైడ్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్: 2.95 కోట్లు షేర్
‘కొండపొలం’ చిత్రానికి రూ.7.75 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా విజయం సాధించాలంటే రూ.8 కోట్లు రావాలి. కానీ ప్రస్తుతం సినిమా నడుస్తున్న తీరు చూస్తుంటే అంత తీసుకురావడం దాదాపు అసాధ్యమే. ఈ లెక్కన బ్రేక్ ఈవెన్ కి మరో రూ.4.8 కోట్లు వసూలు చేయాలి.
ఇవి కూడా చదవండి..
Chiranjeevi | మా ఎన్నికల ఫలితాలపై చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్
Divorce: విడాకులకి సిద్ధమవుతున్న మరో తెలుగు హీరో..నిజమెంత?
Tollywood | ‘మా’ ఎన్నికల పోలింగ్ లో కనిపించని తారలు వీళ్లే
Pragya Jaiswal: ప్రగ్యాకి కరోనా.. టెన్షన్లో బాలయ్య అభిమానులు