Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Parvesh Verma | ఢిల్లీ మంత్రి (Delhi Minister) పర్వేశ్ వర్మ (Parvesh Verma) దేశ రాజధాని ప్రజలకు వినూత్న అభ్యర్థన చేశారు. పుట్టినరోజు (Birthday) వంటి ప్రత్యేకమైన వేడుకలను యమునానది (Yamuna River) ఒడ్డున జరుపుకోవాలని కోరారు. నదిని శుభ్రంగా ఉంచే ప్రణాళికల్లో భాగంగా ఈ ఆలోచన చేశారు.
Parvesh Verma : ఢిల్లీ మంత్రి (Delhi Minister) పర్వేశ్ వర్మ (Parvesh Verma) దేశ రాజధాని ప్రజలకు వినూత్న అభ్యర్థన చేశారు. పుట్టినరోజు (Birthday) వంటి ప్రత్యేకమైన వేడుకలను యమునానది (Yamuna River) ఒడ్డున జరుపుకోవాలని కోరారు. నదిని శుభ్రంగా ఉంచే ప్రణాళికల్లో భాగంగా ఈ ఆలోచన చేశారు. వచ్చే నెల 7న తన పుట్టినరోజును కూడా యమునా నది ఒడ్డున చేసుకోబోతున్నట్లు ఆయన తెలిపారు.
యమునా నది చెంతన పుట్టినరోజు వేడుకలు చేసుకోవాలని ఢిల్లీ ప్రజలను కోరుతున్నానని, నవంబర్ 7న తన పుట్టినరోజును కూడా అక్కడే చేసుకోబోతున్నానని పర్వేశ్ వర్మ చెప్పారు. కుటుంబాలు ఒక దగ్గర చేరి వేడుకలు చేసుకునేందుకు నదీ తీరాల్లో కొన్ని ప్రత్యేక కుటీరాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. అదేవిధంగా ఘాట్లను శుభ్రం చేయడం వంటి స్వచ్ఛంద్ధ కార్యక్రమాల్లో పాల్గొనేవారు కూడా అక్కడ ఉండొవచ్చని మంత్రి చెప్పారు.
నిన్న జరిగిన ‘చలో యమున’ కార్యక్రమంలో 35 వేలమంది పాల్గొని నదికి ఇరువైపులా ఉన్న 70 ప్రదేశాలను శుభ్రంచేశారు. ఈ నేపథ్యంలోనే మంత్రి ప్రకటన వచ్చింది. నదితో వ్యక్తిగత బంధం ఏర్పడినప్పుడు దానిని శుభ్రంగా ఉంచే బాధ్యతను ప్రజలు తీసుకుంటారనేది మంత్రి ఆలోచన. అలాగే యమునానది ప్రక్షాళన, అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లోపు నదిని శుభ్రం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

