Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Daler Mehndi | ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లా నరేంద్ర నగర్లో జరిగిన కుంజపురి మేళాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ సాంస్కృతిక వేడుకలో ప్రదర్శన ఇస్తున్న ప్రముఖ పంజాబీ పాప్ గాయకుడు దాలెర్ మెహందీని రాష్ట్ర కేబినెట్ మంత్రి, స్థానిక బీజేపీ ఎమ్మెల్యే సుబోధ్ ఉనియాల్ వేదికపైనే నిలదీశారు.
Daler Mehndi | ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లా నరేంద్ర నగర్లో జరిగిన కుంజపురి మేళాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ సాంస్కృతిక వేడుకలో ప్రదర్శన ఇస్తున్న ప్రముఖ పంజాబీ పాప్ గాయకుడు దాలెర్ మెహందీని రాష్ట్ర కేబినెట్ మంత్రి, స్థానిక బీజేపీ ఎమ్మెల్యే సుబోధ్ ఉనియాల్ వేదికపైనే నిలదీశారు. దాలెర్ మెహందీ మద్యం మత్తులో ఉన్నారనే ఆరోపణలతో ఈ వివాదం చెలరేగింది. నవరాత్రుల సందర్భంగా అమ్మవారి పూజలతో పవిత్రంగా జరిగే ఈ సాంస్కృతిక కార్యక్రమంలో మద్యం సేవించి ప్రదర్శన ఇవ్వడం తప్పు అని మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు.
ప్రదర్శన సమయంలో దాలెర్ మెహందీ సరిగ్గా మాట్లాడలేకపోతున్నారని, లైవ్ సింగింగ్ చేయకుండా కేవలం లిప్ సింక్ చేస్తూ ప్రేక్షకులను మోసం చేస్తున్నారని మంత్రి సుబోధ్ ఉనియాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “మేము మీకు భారీగా డబ్బులు చెల్లించి ఆహ్వానించాము. మీరు ఇలా మాట్లాడలేకపోతే పాటలు ఎలా పాడతారు? ఇది సరైన పద్ధతి కాదు” అంటూ మంత్రి వేదికపైనే ఆయనను వారించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన మంత్రి సుబోధ్ ఉనియాల్.. దాలెర్ మెహందీ లాంటి గొప్ప కళాకారుడు తన కళకు న్యాయం చేయలేదని, రూ. 35 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నప్పటికీ సరిగ్గా నిలబడలేకపోయారని, కేవలం లిప్-సింక్ చేస్తూ ప్రేక్షకులను నిరాశపరిచారని వివరణ ఇచ్చారు. పవిత్రమైన వేడుకలో సాంప్రదాయాన్ని, హుందాతనాన్ని కాపాడేందుకే తాను జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.
उत्तराखंड के नरेंद्रनगर में चल रहे प्रसिद्ध कुंजापुरी मेले के दौरान रविवार शाम को एक हैरान करने वाला मामला सामने आया है।
मेले में मंच पर पंजाबी गायक दलेर मेहंदी की परफॉर्मेंस चल रही थी, तभी कैबिनेट मंत्री सुबोध उनियाल अचानक मंच पर चढ़ गए और सिंगर की जमकर क्लास लगा दी।मंत्री माइक पर यह कहते हुए सुनाई दिए कि “बोला तो जा नहीं रहा, गाना क्या गा पाओगे।” रिपोर्ट्स के मुताबिक, दलेर मेहंदी को करीब 40 लाख रुपये की फीस देकर बुलाया गया था, लेकिन आरोप है कि वे मंच पर ठीक हालत में नहीं थे और ओरिजिनल गाने की बजाय लिप सिंक कर रहे थे, जिसे देखकर मंत्री भड़क उठे।
— Sharma ji (@Sharmaji2772) October 19, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

