Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Donald Trump | ఇరాన్ (Iran) పై అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన ఆరోపణ చేశారు. గత ఎనిమిది నెలల కాలంలో ఇరాన్ ప్రభుత్వం (Iran Govt) 75 వేల మంది నిరసనకారులను చంపేసిందని ఆరోపించారు. అమెరికా (USA) లో వచ్చే నెలలో మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి.
Donald Trump : ఇరాన్ (Iran) పై అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన ఆరోపణ చేశారు. గత ఎనిమిది నెలల కాలంలో ఇరాన్ ప్రభుత్వం (Iran Govt) 75 వేల మంది నిరసనకారులను చంపేసిందని ఆరోపించారు. అమెరికా (USA) లో వచ్చే నెలలో మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం నిర్వహించిన ప్రచార సభలో ట్రంప్ మాట్లాడుతూ ఈ ఆరోపణ చేశారు.
ఇరాన్ను ఉద్దేశించి ట్రంప్ ఏమన్నారంటే.. ‘వారు ఎన్నో హత్యలు చేశారు. కనీసం 75 వేలమంది నిరసనకారులను చంపేశారు. అక్కడి ప్రజలు ఎందుకు నిరసనలు చేయడం లేదని నాతో కొందరు అన్నారు. వీధి చివరన మెషిన్ గన్లతో కాల్పులు జరుపుతుంటే నిరసనలు కష్టమే కదా..! అంతేగాక ఇరాన్ ప్రభుత్వం చంపేసిన వారిని అందరూ చూసేలా క్రేన్లకు వేలాడదీస్తున్నది. అది చాలా విచారకరం’ అంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు.
అదేవిధంగా నాటో దేశాలపై ట్రంప్ విమర్శలు గుప్పించారు. ‘ఇరాన్ యుద్ధంలో సహాయం కావాలని అడిగాను. వాస్తవంగా ఆ సహాయం మనకు అవసరం లేదు. కానీ ఆ దేశాలను పరీక్షించే ఉద్దేశంతోనే నేను అడిగాను. వాటి ఆలోచన ఏంటో తెలుసుకోవాలనుకున్నాను. ఎందుకంటే మనం నాటోకు భారీగా నిధులు ఖర్చు పెడుతున్నాం. మనం అంత ఖర్చు పెడుతుంటే.. సహాయం అడిగినప్పుడు మాత్రం ఆ దేశాల నుంచి నో అని సమాధానం వచ్చింది’ అని ఆ ప్రచారసభకు వచ్చిన జనంతో ట్రంప్ అన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

