హ్రిదు హరూన్ హీరోగా నటిస్తున్న సినిమా ‘కోనసీమ థగ్స్’. సింహా, ఆర్కే సురేష్, మునిష్ కాంత్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని దర్శకుడు బృందా గోపాల్ తెరకెక్కించారు. హెచ్ఆర్ పిక్చర్స్ పతాకంపై రియా షిబు నిర్మించారు. ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ నెల 24న విడుదల చేస్తున్నారు. ఇప్పటిదాకా సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్, పోస్టర్‌కు మంచి స్పందన వస్తున్నదని, సినిమా కూడా ప్రేక్షకాదరణ పొందుతుందని చిత్రబృందం నమ్మకంతో ఉన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : ప్రీయేష్ గురుస్వామి, సంగీతం : సామ్ సీఎస్.