Raghuram | పచ్చకామెర్లతో యువ సంగీత దర్శకుడు కన్నుమూత
Kollywood Music Composer Raghuram | తమిళ యువ సంగీత దర్శకుడు రఘురామ్ కన్నుమూశాడు. పచ్చ కామెర్ల ( jaundice )తో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు.
Kollywood Music Composer Raghuram | తమిళ యువ సంగీత దర్శకుడు రఘురామ్ కన్నుమూశాడు. పచ్చ కామెర్ల ( jaundice )తో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మరణవార్త తెలిసి కోలీవుడ్ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ఈ విషయం తెలిసి పలువురు రఘురామ్ మృతికి సంతాపం తెలుపుతున్నారు.
ఇటీవల పచ్చ కామెర్ల బారిన పడిన యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ రఘురామ్ చికిత్స తీసుకుంటున్నాడు. అయినప్పటికీ తక్కువ సమయంలోనే జాండిస్ వ్యాధి ముదిరింది. ఒళ్లంతా పాకింది. ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. కనీసం నడవలేని స్థితికి చేరుకున్నాడు. దీంతో ఆయన్ను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స తీసుకుంటున్న రఘురామ్.. శనివారం ప్రాణాలు విడిచాడు. 2017లో వచ్చిన ఒరు కిడియాన్ కరుణై మను చిత్రంతో సంగీత దర్శకుడిగా మారాడు రఘురామ్. ఆ సినిమాకు రఘురామ్ ఇచ్చిన మ్యూజిక్ అందర్నీ ఆకట్టుకుంది. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేసింది. ఈ సినిమా తర్వాత రివైండ్, ఆసాయి సినిమాలకు కూడా సంగీతం అందించాడు. ప్రస్తుతం సాథియా సొథనై సినిమాకు పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో రఘురామ్ అకస్మాత్తుగా మరణించడం అందర్నీ కలిచివేస్తోంది.
Read More :
Prithiveeraj | లేటు వయసులో 24 ఏళ్ల అమ్మాయిని నటుడు పృథ్వీ రెండో పెళ్లి చేసుకున్నాడా?
మయోసైటిస్‌తో బాధపడుతున్న సమంత.. ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

