Kollywood Directors | ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు చరిత్రలు సృష్టిస్తున్నారు. చిన్న హీరోల నుండి పెద్ద హీరోల వరకు అద్భుతాలు చేస్తున్నారు. బాలీవుడ్ హీరోలని డామినేట్ చేస్తూ మంచి సక్సెస్‌లు అందుకుంటున్న నేపథ్యంలో మనోళ్లతో సినిమాలు చేసేందుకు ఇతర ఇండస్ట్రీకి చెందిన దర్శక నిర్మాతలు తెగ ఆసక్తి చూపుతున్నారు. అయితే మన హీరోలతో తమిళ దర్శకులు చేసిన సినిమాలు పెద్దగా హిట్ కావడం లేదు. ఇటివలి కాలంలో మన హీరోలతో తమిళ దర్శకులు తెరకెక్కించిన సినిమాలు చూస్తే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బ్రో సినిమాని తమిళ్ డైరెక్టర్ అయిన సముద్ర ఖని తెరకెక్కించగా, ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది.
ఇక ఈ సంక్రాంతికి శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా వచ్చిన ‘గేమ్ చేంజర్’ సినిమా ఎలాంటి ఫలితం అందుకుందో మనం చూశాం. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్‌గా మంచి పేరు తెచ్చుకున్న రామ్ చరణ్‌కి గేమ్ ఛేంజర్ బ్యాడ్ నేమ్ తెచ్చిపెట్టింది. ఇక ఇప్పుడు అల్లు అర్జున్‌తో అట్లీ ఓ భారీ ప్రాజెక్టే చేస్తున్నాడు. ఈ సినిమా ఇండియన్ హిస్టరీలో నిలిచిపోయేలా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. అట్లీ ఇప్పటి వరకు అపజయాలు ఎదుర్కొంది లేదు. మరి ఇప్పుడు బన్నీతో ఎలా చేస్తాడు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వీడియోని రిలీజ్ చేయగా, ఇది మూవీపై భారీ అంచనాలే పెంచింది. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా మూవీని రూపొందించనున్నట్టు తెలుస్తుంది. హాలీవుడ్ రేంజ్లో సినిమా ఉంటుందని తెలుస్తుండగా, ఈ డైరెక్టర్ బన్నీకి హిట్ ఇస్తాడా లేదా అనేది చూడాలి. మరోవైపు ప్రభాస్‌కి సలార్ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ మరి కొద్ది రోజులలో ఎన్టీఆర్‌తో క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఈ చిత్రంపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి . ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని పొందుతుందో అని కూడా టాలీవుడ్లో చర్చ నడుస్తుంది.