Kishkindhapuri |టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడూ వినూత్న కథలని, కొత్త జానర్స్‌ని ఆదిరిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా హారర్ సినిమాలంటే ప్రత్యేకమైన ఆకర్షణ చూపే వీక్షకులకు ఇప్పుడు ఓ కొత్త అనుభూతిని అందించేందుకు వస్తోంది ‘కిష్కింధపురి’. ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో రూపొందుతున్న హారర్ థ్రిల్లర్ ఇప్పటికే సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రాన్ని యువ దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవాలన్న లక్ష్యంతో ఈ సినిమాను తెరపైకి తీసుకువస్తున్నారు.ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తుండగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ కాంబినేషన్ ఫస్ట్‌టైం కావడం, ఇద్దరికీ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ సినిమాపై హైప్ పెంచేశాయి. టీజర్లో చూపించిన డార్క్ హారర్ ఎలిమెంట్స్, థ్రిల్లింగ్ విజువల్స్ ప్రేక్షకుల్లో మంచి పాజిటివ్ రిస్పాన్స్ తెచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులోని సన్నివేశాలు ప్రేక్షకులకి సినిమాపై ఆసక్తిని కలిగించాయి. హారర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకి తప్పక నచ్చేలా ఉంది. చివర్లో అనుపమ భయపెట్టించేసింది. బెల్లంకొండ మరోసారి తన పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుబోతున్నాడని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. ఈ సినిమా సెప్టెంబర్ 12న రిలీజ్ కానుందని ట్రైలర్ ద్వారా తెలియజేశారు.
సినిమా సెన్సార్ పనులు పూర్తి అయ్యాయి. ఇందులో హారర్ సీన్స్, ఇంటెన్స్ మూడ్ దృష్ట్యా, సెన్సార్ బోర్డు A సర్టిఫికేట్ జారీ చేసింది. మేకర్స్ మాత్రం ఈ ఎలిమెంట్స్ ఆడియన్స్‌ను థ్రిల్ చేస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘కిష్కింధపురి’ సినిమా రన్‌టైమ్ 2 గంటల 5 నిమిషాలు. హారర్ సినిమాలకు ఇది సరైన సమయం అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. కథను సమర్థవంతంగా చెప్పేందుకు ఇది పర్ఫెక్ట్ లెంగ్త్ అంటున్నారు.ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఆయన చేసిన సినిమాల్లో మ్యూజిక్ హైలైట్‌గా నిలిచిన నేపథ్యంలో, ఈ సినిమాకు అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హారర్ ఎఫెక్ట్‌ను మరింత ఎలివేట్ చేస్తుందని భావిస్తున్నారు అభిమానులు. ‘కిష్కింధపురి’ను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్ గతంలో పలు హిట్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.