కిరీటిరెడ్డి, శ్రీలీల జంటగా తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతున్న ద్విభాషాచిత్రం ‘జూనియర్’. రవిచంద్రన్, జెనీలియా కీలక పాత్రలు పోషించారు. రాధాకృష్ణ దర్శకుడు. రజనీ కొర్రపాటి నిర్మాత. జూలై 18న సినిమాను విడుదల చేయనున్నట్టు టీమ్ గురువారం ప్రకటించింది. ఈ సందర్భంగా రిలీజ్‌డేట్ పోస్టర్ని కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్లో ప్రధాన తారాగణమంతా ఆనందంగా కనిపిస్తుండగా, జెనీలియా మాత్రం సీరియస్ లుక్‌తో దర్శనమిస్తున్నారు.
కుటుంబం అంతా కలిసి చూడదగ్గ భావోద్వేగ ప్రయాణమే ఈ సినిమా అని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రానికి సంభాషణలు: కల్యాణ్ చక్రవర్తి త్రిపురనేని, కెమెరా: కె.కె.సెంథిల్‌కుమార్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాణం: వరాహి చలనచిత్రం.